BigTV English
Advertisement

Worst First Date: కలిసిన పావుగంటకే ముద్దు అడిగాడు, ఆ తర్వాత.. అమ్మాయి ఫస్ట్ డేట్ అనుభవాలు..

Worst First Date: కలిసిన పావుగంటకే ముద్దు అడిగాడు, ఆ తర్వాత.. అమ్మాయి ఫస్ట్ డేట్ అనుభవాలు..

First Date: ఈ రోజుల్లో యూత్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. వారికి తగినట్లుగానే బోలెడు డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో తమకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుని డేటింగులు, మీటింగులకు వెళ్లడం కామన్ అయ్యింది. కొంత మంది సోషల్ మీడియా ద్వారా పరిచయమై మీట్ అవుతుంటారు. ఒక్కోసారి మనం ఎంతో గొప్పగా ఊహించుకుని వెళ్తే, వచ్చిన పర్సన్స్ బిహేవియర్ చెత్తగా ఉంటే చాలా బాధపడాల్సి ఉంటుంది. అలా ఇబ్బంది పడ్డ ఓ ఐదుగురు అమ్మాయిల ఫస్ట్ డేట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


1.పావు గంటకే ముద్దా?

“మేం ఆఫీస్ అయ్యాక కేఫ్ లో కలవాలి అనుకున్నాం. కానీ, త్వరగా కలవాలనే ఆత్రం ఎక్కువైంది. అనుకున్న సమయానికంటే  ముందే మేం మా ఆఫీస్ దగ్గర కలిశాం. కాసేపు మాట్లాడుకున్నాం. ఇంచుమించు 15 నిమిషాల తర్వాత నన్ను ముద్దు పెట్టుకోవాలనుందని చెప్పాడు. నేను షాక్ అయ్యాను. సున్నితంగా తిరస్కరించాను. వెంటనే తన ఇంటికి రమ్మన్నాడు. అతడి మాటలు, చేష్టలు నాకు చాలా విసుగు కలిగించాయి. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ తనతో బయటకు వెళ్లలేదు”-సమ్మీ, 25 సంవత్సరాలు


2.మర్యాద తెలియని వ్యక్తి

“నేను పెళ్లి చూపులలో భాగంగా ఓ అబ్బాయిని కలిశాను. నేను మాట్లాడుతున్నప్పుడు అతడికి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి ఎదుటి వారి మీద చాలా కోపంగా అరుస్తున్నాడు. ఫోన్ కట్ చేశాక, తన జాబ్ అలాగే ఉంటుందని చెప్పాడు. నాకు కాఫీ ఆఫర్ చేశాడు. కానీ, వద్దు అని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాను. మళ్లీ ఎప్పుడూ తనను చూడకూడదు అనుకున్నను”- తాన్యా మాలిక్, 30 ఏళ్లు

3.ఎస్కేపిస్ట్

“మేము లంచ్ డేట్‌కి వెళ్ళాము. నచ్చిన ఫుడ్ తింటూ కాసేపు గడిపాం. బిల్లు వచ్చే సమయంలో నేను నా పర్సు తీస్తుండగా, తను ఈసారి చెల్లిస్తానని చెప్పాడు. నెక్ట్స్ టైమ్ నన్ను పే చేయమన్నాడు. బిల్ అమౌంట్ చూసిన, అర్జంట్ కాల్ వచ్చినట్లు నటించి 2 నిమిషాలల్లో వస్తానని చెప్పి వెళ్లాడు. కానీ, మళ్లీ కనిపించలేదు. మరో 15 నిమిషాలు వెయిట్ చేసి బిల్లు పే చేసి వచ్చాను. ఇలాంటి వారు కూడా ఉంటారా? అనుకున్నాను”- జ్యోతి, 22 ఏళ్లు

4.డేటింగ్ కాదు బోరింగ్

“నేను ఒక పార్కులో ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళాను. ఫస్ట్ డేట్ కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ, తను పైజామా వేసుకుని రావడంతో డిసప్పాయింట్ అయ్యాను. తనతో వెళ్లడం పెద్దగా నచ్చలేదు. ఇంటికి వచ్చే సమయానికి చాలా అలసిపోయాను. అతడు నాకు సెట్ కాడు అనిపించింది. కాల్స్, మెసేజెస్ కు రిప్లై ఇవ్వడం మానేశాను. కానీ, నా ఫ్రెండ్స్ దగ్గర నా గురించి ఆరా తీయడం మొదలు పెట్టాడు. అతడి మీద ఉన్న కాస్త గౌరవం పోయింది”-నమ్రత గంగూలీ, 26 ఏళ్లు

5.అతడి ప్రవర్తన నచ్చలేదు

“నేను కలిసిన వ్యక్తితో  కొంతకాలంగా పరిచయం ఉన్నది. అతడి ఇంటికే వెళ్లాను. చాలా సౌకర్యంగా ఫీలయ్యాను. కానీ, కొద్దిసేపటి తర్వాత తను నా దగ్గరికి వచ్చాడు. నేను షాక్ అయ్యాను. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. నెమ్మదిగా అక్కడి నుంచి బయటపడ్డాను. మళ్లీ కలవలేదు” -లబాని మహానంది, 25 ఏళ్లు

Read Also: మహిళకు ఐ-పిల్ పేరుతో అలాంటి మెసేజ్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×