E-Paper
Advertisement

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహారం మంచిది కాదా?

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహారం మంచిది కాదా?
Advertisement

ప్రస్తుత జీవనశైలిలో ప్రెషర్ కుక్కర్ వంటగదిలో విడదీయరాని బంధమైపోయింది. బియ్యం, పప్పులు, కూరగాయలు, మాంసం వంటి వంటకాలు తక్కువ సమయంలో మెత్తగా ఉడికించేందుకు కుక్కర్ వాడుతున్నాము. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రెషర్ కుక్కర్‌లో వండిన ఆహారం ఆరోగ్యానికి హానికరమని కొన్ని పోస్టులు రావడంతో చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువ ప్రెషర్ వల్ల పోషకాలు తగ్గుతాయా? వంటలో రసాయన మార్పులు వస్తాయా? అన్న అనుమానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ న్యూట్రిషన్ నిపుణులు ఈ విషయంపై వివరణ ఇచ్చారు.

పోషకాలు తగ్గవు
ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం ఆహారంలోని పోషకాలను తగ్గించదు. వాస్తవానికి సాధారణ గిన్నెల్లో ఎక్కువసేపు ఉడికించడం వల్ల విటమిన్లు వేడిలో నశించవచ్చు. కానీ కుక్కర్‌లో చాలా తక్కువ నీటితో, తక్కువ సమయంలో పదార్థాలు మెత్తబడుతాయి. కాబట్టి విటమిన్ C, B వంటి వేడికి సున్నితమైన పోషకాలు కూడా బయటికి పోకుండా ఉంటాయి. పప్పులు, బియ్యం వంటి పదార్థాలను కుక్కర్‌లో వండితే అవి సులభంగా జీర్ణమవుతాయని కూడా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె, డయాబెటిస్ ఉన్నవారికి మెత్తని ఆహారం అవసరం. ఈ విషయంలో ప్రెషర్ కుక్కర్ వంట ఎంతో ఉపయోగకరం. అంతేకాదు, కూరగాయలను స్టీమ్‌లో వండితే మరింత ఆరోగ్యకరంగా అవుతాయని వారు సూచిస్తున్నారు.

Advertisement

కుక్కర్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆహారంలో హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయనేది ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. కానీ నిపుణులు చెబుతున్న ప్రకారం ఇది పూర్తిగా తప్పుడు ఆలోచన. కుక్కర్ వేడి పెరిగేది కేవలం నీటి ఆవిరి వల్ల మాత్రమే. ఇది డీప్ ఫ్రై చేయడం, ఎక్కువ నూనె వేయడం, బర్న్ చేయడం వంటి పద్ధతుల్లా హానికర రసాయనాలు ఉత్పత్తి చేయదు. అలాంటి ప్రమాదాలు ఆయిల్ వేసి వేయించడంలో మాత్రమే ఉంటాయి. కానీ కుక్కర్ వంటలో కావు. అంతేకాదు, పప్పులలో ఉండే యాంటీ న్యూట్రియెంట్లు కూడా ప్రెషర్ కుక్కర్ వేడి వల్ల తగ్గిపోతాయి. దీని వల్ల శరీరం పోషకాలను మరింత బాగా గ్రహిస్తుంది. కుక్కర్ వంట వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.

ఈ జాగ్రత్తలు అవసరం
ప్రెషర్ కుక్కర్‌లో వంట చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. పాత కుక్కర్లు, పాడైన గాస్కెట్లు, నాసిరకం అల్యూమినియం పాత్రలు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే నిపుణులు స్టీల్ లేదా హై క్వాలిటీ అల్యూమినియం కుక్కర్లు ఉపయోగించమని చెబుతున్నారు. నీటిని అవసరానికి మించి వేయకూడదు. కుక్కర్‌లో వండిన తర్వాత ఆహారాన్ని ఎక్కువసేపు అందులోనే ఉంచకుండా వెంటనే బయటకు తీసి చల్లబెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రెషర్ కుక్కర్ వంట పూర్తిగా సురక్షితం, ఆరోగ్యదాయకం.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×