Happy Republic Day 2026: 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి, ఇండియా ఒక సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ పవిత్రమైన రోజున మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తిని చాటిచెప్పే అద్భుతమైన కొటేషన్లు, వాట్సాప్ స్టేటస్‌లు, మెసేజ్‌ల ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులకు విషెస్ చెప్పండి.
భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు :
1.”మన దేశం, మన గర్వం. భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులను గౌరవిస్తూ.. బాధ్యతగల పౌరులుగా మెలుగుదాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!”
2.”వేలమంది వీరుల త్యాగఫలం.. ఈ గణతంత్ర దినోత్సవం. ఆ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే!
3.”కుల, మత భేదాలు వీడదాం.. భారతీయులమన్న ఐక్యతను చాటుదాం. భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలలా ఎగురవేద్దాం.”హ్యాపీ రిపబ్లిక్ డే!”
4.”శాంతి, సౌభాగ్యాల భారతావని కోసం మనమంతా పునరంకితం అవుదాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!”
5.”స్వేచ్ఛ మన జన్మహక్కు, సమత మన ఆశయం, మమత మన సందేశం. భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”
6.”జన్మభూమికి మించిన స్వర్గం లేదు.. దేశ సేవకు మించిన ధర్మం లేదు. హ్యాపీ రిపబ్లిక్ డే 2026!”
7.”న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం.. ఇవే మన రాజ్యాంగ మూలస్తంభాలు. వీటిని కాపాడుకోవడమే మనం దేశానికి ఇచ్చే గొప్ప గౌరవం.” హ్యాపీ రిపబ్లిక్ డే!”
8.”మనం చేసే ప్రతి పనిలో దేశం పట్ల భక్తి ఉండాలి. అప్పుడే భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”
9.”వందేమాతరం! ఈ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డ దేశ సేవకు అంకితం కావాలని కోరుకుంటూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”
10.”మనందరి గుర్తింపు ఒకటే.. మనం భారతీయులం. ఈ ఐక్యతను కాపాడుకుందాం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు!”
11.”త్రివర్ణ పతాకం నీడలో స్వేచ్ఛను అనుభవిస్తున్న మనమంతా ధన్యులం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”
12.”దేశభక్తి అంటే కేవలం జెండా ఎగురవేయడం కాదు.. దేశం పట్ల బాధ్యతగా మెలగడం. హ్యాపీ రిపబ్లిక్ డే!”
13.”గణతంత్ర భారతాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని ప్రతిజ్ఞ చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”
14. రాజ్యాంగం మనకు అందించిన సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని గౌరవిద్దాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”
15. మహనీయుల త్యాగఫలం మన ఈ గణతంత్రం. వారి ఆశయాలను గుండెల్లో నింపుకుందాం. హ్యాపీ రిపబ్లిక్ డే !
16.స్వేచ్ఛకు అర్థం బాధ్యత.. ఆ బాధ్యతను సగర్వంగా మోద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే.
17.భారత్ మాతా కీ జై! మన దేశ గౌరవాన్ని దశదిశలా చాటుదాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
18.కులం, మతం ఏదైనా.. మనం భారతీయులమనే స్ఫూర్తితో కలిసి నడుద్దాం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
19.నా దేశం.. నా గర్వం. ఈ చారిత్రాత్మక దినాన అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
20.”ప్రతి ఇంట్లో జెండా ఎగరాలి.. ప్రతి గుండెలో దేశభక్తి వెలగాలి. హ్యాపీ రిపబ్లిక్ డే!”
21.”శాంతి, సత్యం, అహింస మన ఆయుధాలు.. అభివృద్ధి మన లక్ష్యం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”
22.”భాషలు వేరైనా, భావం ఒక్కటే.. మనమంతా భారతీయులం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
23.”నవ భారతాన్ని నిర్మిద్దాం.. ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దాం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.”
24.”స్వేచ్ఛా వాయువులను పంచుతున్న గణతంత్ర భారతికి వందనం. హ్యాపీ రిపబ్లిక్ డే.”
25.”మన రాజ్యాంగం – మన ఆత్మగౌరవం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”
26.”దేశం కోసం బ్రతుకుదాం.. దేశం కోసం శ్రమిద్దాం. జై హింద్!”
27.”గర్వంగా చెప్పుకుందాం.. నేను భారతీయుడిని అని. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
28.”ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ముందడుగు వేద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే!