E-Paper
Advertisement

Republic Day of India 2026: గణతంత్ర దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, ఆసక్తికర విషయాలు మీ కోసం!

Republic Day of India 2026: గణతంత్ర దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, ఆసక్తికర విషయాలు మీ కోసం!
Advertisement

Republic Day of India 2026: వ్యాపారం కోసం మన దేశంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు.. అప్పటి భారత్ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని మన గడ్డపై పాగా వేశారు. నాటి రాజులు, సంస్థానాధిపతుల మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకుని ‘విభజించు.. పాలించు’ అనే నినాదంతో మన దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నారు. అలా దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన బ్రిటీష్ పాలన నుంచి భరతమాతకు విముక్తి కలిగించడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలను కోల్పోయారు.

గాంధీజీ నాయకత్వంలో అహింస అనే ఆయుధంతో సాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత.. 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చింది. అయితే, స్వాతంత్య్రం లభించడం ఒక ఎత్తయితే.. వందల ఏళ్ల బానిసత్వం తర్వాత మన దేశాన్ని మనమే పాలించుకునేలా ఒక పటిష్టమైన చట్టాన్ని తయారు చేసుకోవడం మరో ఎత్తు. ఆ చట్టమే మన రాజ్యాంగం. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం చరిత్ర, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

రాజ్యాంగం వెనుకున్న అసలు చరిత్ర..

Advertisement

1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ.. అప్పట్లో మనకంటూ ఒక సొంత పాలనా చట్టం లేదు. ఆంగ్లేయులు రూపొందించిన చట్టాల ఆధారంగానే పాలన సాగేది. ఈ పరిస్థితిని మార్చి, మన దేశానికి ఒక పటిష్టమైన పునాది వేయడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది.

Also Read: యాపిల్ సంచలన నిర్ణయం.. చాట్ జీపీటీకి దీటుగా కొత్త ఏఐ సిరి, ఐఫోన్ వాడకాన్ని పూర్తిగా మార్చేసే ఫీచర్లివే!

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం..

Advertisement

దాదాపు 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల పాటు అనేక చర్చలు, మార్పుల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మన దేశం సిద్ధం చేసుకుంది. ఈ రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందినప్పటికీ, 1950 జనవరి 26 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఆ సెకండ్ నుంచే భారత్ ఒక సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా అవతరించింది.

గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత..

గణతంత్రం అంటే.. ‘ప్రజల చేత ప్రజల కోసం పాలించబడే దేశం’. మన రాజ్యాంగం మనకు భావ ప్రకటనా స్వేచ్ఛను, సమానత్వాన్ని, జీవించే హక్కును కల్పించింది. దేశంలో ప్రతి పౌరుడు చట్టం ముందు సమానమని, సామాన్యుడు కూడా అత్యున్నత పదవులను అధిరోహించవచ్చని మన రాజ్యాంగం ద్వారా చాటి చెప్పడం జరిగింది. ప్రతి ఏటా మనం జరుపుకునే ఈ వేడుకలు కేవలం మన సైనిక శక్తిని ప్రపంచానికి చూపడమే కాదు.. మన దేశంలోని విభిన్న సంస్కృతులు, భాషలు, ఐక్యతను కూడా ప్రతిబింబిస్తాయి.

77వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం..

2026 నాటికి భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ రంగం.. ఇలా ప్రతి రంగంలోనూ మన దేశం దూసుకుపోతోంది. ఈ ఏడాది వేడుకలు మన విజయాలను స్మరించుకోవడమే కాకుండా.. రాబోయే తరాలకు ఒక దిశానిర్దేశం చేసేలా సాగుతున్నాయి. నవ భారతాన్ని నిర్మించడంలో యువత పాత్ర ఎంత కీలకమో ఈ వేడుకలు గుర్తుచేస్తాయి. మన రాజ్యాంగ నిర్మాతలు కన్న కలలను నిజం చేస్తూ.. దేశాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషించడం ప్రతి పౌరుడి బాధ్యత.

Also Read: జనవరి 26నే గణతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుకున్న అసలు కారణం ఇదే!

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×