E-Paper
Advertisement

Gold Cleaning Tips: బంగారు ఆభరణాలు నల్లగా మారాయా? ఇలా ఇంట్లోనే సింపుల్‌గా తళతళలాడించేయండి

Gold Cleaning Tips: బంగారు ఆభరణాలు నల్లగా మారాయా? ఇలా ఇంట్లోనే సింపుల్‌గా తళతళలాడించేయండి
Advertisement

మనదేశంలో బంగారానికి విలువ ఎక్కువ. మహిళలు ఎంతో ఇష్టంగా వీటిని ధరిస్తారు. బంగారం అనేది ఒక లోహమే కాదు అది మన దేశంలో ఆధ్యాత్మిక, భావోద్వేగా భావాలను కలిగి ఉంటుంది. అప్పుడప్పుడు అవి నల్లగా మురికి పడతాయి. ఆ సమయంలో మెరుగుపెడతామని అనే వాళ్ల దగ్గరికి వెళ్లి మోసపోతూ ఉంటారు. కాబట్టి ఇంట్లోనే సులువుగా వీటిని శుభ్రం చేయడం ఎలాగో తెలుసుకుంటే మీకెలాంటి సమస్యా రాదు. బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి వంట గదిలో ఉన్న కొన్ని వస్తువులు ఉపయోగపడతాయి.

బేకింగ్ సోడా
అన్ని ఇళ్లల్లో బేకింగ్ సోడా ఉంటుంది. పకోడీలు, గారెలు, ఇడ్లీలు చేసేటప్పుడు మెత్తగా వచ్చేందుకు బేకింగ్ సోడాను కలుపుతూ ఉంటారు. బంగారాన్ని తళతళ మెరిసేలా చేసేందుకు బేకింగ్ సోడాను వినియోగించవచ్చు. నీటిలో బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. అందులో నల్లగా మురికిపట్టిన బంగారు ఆభరణాలను వేసి అరగంట పాటు వదిలేయాలి. తర్వాత బ్రష్ తో మెల్లగా తోమాలి. స్వచ్ఛమైన నీటితో కడిగితే బంగారు ఆభరణాలు మెరిసిపోతాయి.

Advertisement

పసుపు
ఇంట్లో పసుపు పొడి సాధారణంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో పసుపు కలిపి అందులో నగలను కొన్ని నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత మెత్తటి బ్రష్ తో నగలను రుద్దండి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి. ఆ తర్వాత మెత్తని వస్త్రంతో బంగారు ఆభరణాలు పొడిగా వచ్చేలా తుడవండి. అంతే బంగారు ఆభరణాలు మెరిసిపోతాయి.

టూత్ పేస్ట్
దంతాలను శుభ్రపరిచే టూత్ పేస్ట్ బంగారు ఆభరణాలను కూడా మెరిపిస్తుంది. మీ బంగారు ఆభరణాలకు టూత్ పేస్ట్ రాసి పైన నిమ్మరసం చల్లండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో వీటిని వేసి నానబెట్టండి. తర్వాత మెత్తని బ్రష్ తో శుభ్రం చేయండి. దీంతో ఆభరణాలు చక్కగా మెరుస్తాయి.

Advertisement

ఉప్పు, నిమ్మకాయ
చిన్న గిన్నెలో వేసి నిమ్మరసం వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. తర్వాత వాటిని బంగారు ఆభరణాలపై వేసి రుద్దాలి. అలా పావుగంట పాటు వదిలేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ఆభరణాలు మెరుస్తాయి. ఇక్కడ చెప్పిన పద్ధతులు ఏవీ కూడా పెద్దగా ఖర్చు లేనివి. కాబట్టి స్వర్ణకారుల వద్దకు లేదా మెరుగుపెడతామని చెప్పే వాళ్ళను నమ్మకండి. ఇంట్లోనే ఇలా ఆభరణాలను శుభ్రం చేసుకోండి.

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×