AP Ration Card eKYC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డుల్ని పంపిణీ పౌరసరఫరాల శాఖ ఈ-కేవైసీపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేసిన స్మార్ట్ కార్డులను ఇంకా చాలామంది తీసుకోలేదు. రేషన్ డీలర్ల వద్దే స్మార్ట్ కార్డులు ఉండిపోయాయి. కార్డులను తీసుకెళ్లాలని కోరినా చాలా మంది తీసుకెళ్లడంలేదు.
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీలో అవకతవకలు లేకుండా పారదర్శకంగా స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేసింది. అలాగే రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. ఈ-కేవైసీతో అక్రమాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. దీంతో అనర్హులను తొలగించాలని నిర్ణయించింది. రేషన్‌కార్డులు ఉన్నవారంతా ఈ-కేవైసీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికీ పలుమార్లు ఈ-కేవైసీ గడువును పెంచింది. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని వారి రేషన్ కార్డులను రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుంది.
రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు రేషన్ డీలర్ వద్దకు వెళ్లి జస్ట్ ఈ-పోస్ లో వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఆ వెంటనే రేషన్ కార్డుదారుడి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. అయితే చాలా మంది రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడంలేదు. దీంతో కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ చేయించుకోని వారి వివరాలను ఆరా తీస్తున్నారు. రేషన్ ఈ-కేవైసీ పూర్తి చేయని వారి వివరాలను పరిశీలించి అనర్హులను గుర్తించి, కార్డుల రద్దు చేసే అవకాశం ఉంది.
పేదరిక నిర్మూలన భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుల ద్వారా నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నాయి. అలాగే రేషన్ కార్డుదారులకు సంక్షేమ పథకాలు అందిస్తుంటారు. దీంతో కొందరు అనర్హులు సంక్షేమ పథకాలు పొందేందుకు అక్రమ మార్గాల్లో రేషన్ కార్డులు పొందుతున్నారు. అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీ అమలు చేస్తుంది.
Also Read: Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో
రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ పూర్తయిందో? లేదో? ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
1. ఏపీ పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్ https://epds2.ap.gov.in/epdsAP/epds లో ఓపెన్ చేయండి.
2. డ్యాష్ బోర్డ్ పై క్లిక్ చేస్తే రేషన్ కార్డు సెక్షన్‌లో EPDS Application Search లేదా Rice Card Search ఆప్షన్ కనిపిస్తుంది.
3. మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే స్క్రీన్ పై కుటుంబసభ్యుల వివరాలు డిస్ ప్లై అవుతాయి.
4. రేషన్ కార్డు సభ్యుడి పేరు ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ అని కన్పిస్తే ఈ-కేవైసీ పూర్తి అయినట్లు లేదా పెండింగ్ లో ఉందని అర్ధం.
5. ఐదేళ్లలోపు పిల్లలు 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈ- కేవైసీ అవసరం లేదు.