Health Tips 2026: సరికొత్త ఆశలతో, ఆశయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా చాలామంది అన్నిటి కంటే ఎక్కువగా ఆరోగ్యం మీదే శ్రద్ధ పెట్టాలని ప్లాన్ చేసుకుని ఉంటారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం అనేది కష్టంతో కూడుకున్న పనే. మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, గంటల కొద్ది కంప్యూటర్‌తో కుస్తీలు పడటం ఇలా.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నాం. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే.. తప్పనిసరిగా నిత్యం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో 2026 ఏడాదంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి విషయాలు మీద ఫోకస్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
⇒ పొద్దున్నే అల్పాహారాన్ని పొరపాటున కూడా మిస్ చేయొద్దు. అలా మిస్ చేస్తే మన జీర్ణవ్యవస్థకు దాదాపు 10 గంటలపాటు ఆహారం అందదు.
⇒ మీ భోజనంలో ప్రధానంగా అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. తక్షణ శక్తినచ్చే కార్బొహైడ్రేట్లు, కణజాలాన్ని రిపేర్ చేసే ప్రొటీన్లు, శరీరానికి అవసరమైన కొవ్వులతో పాటు విటమిన్లు, మినరల్స్, మైక్రో న్యూట్రియన్లు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి.
⇒ సంపూర్ణ ఆరోగ్యం కోసం తరచుగా ఆకురూరలు, పప్పు, తాజా పండ్లు, సలాడ్లు వంటివి తీసుకోవాలి. అలాగే ఆహారాన్ని ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా.. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. దీంతోపాటు ప్రతిరోజూ ఒకే సమయానికి లంచ్, డిన్నర్ ప్లాన్ చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
⇒ అన్నిటి కంటే ముఖ్యంగా రోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మంచి నీళ్లు తాగడం తప్పనిసరి. అలాగే జంక్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఆహారం, అతిగా వాడిన చక్కెర పదార్థాలతో పాటు టీ, కాఫీలను క్రమంగా తగ్గించుకోవాలి.
⇒ బిర్యానీ వంటి వాటితో పాటు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటే.. దానిని వెంటనే మానేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. చివరిగా ఏది తిన్నా.. మితంగా తినాలి. దీంతోపాటు శరీరానికి వ్యాయామం చాలా అవసరం. దీని వల్ల కొత్త ఏడాదిలో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.