E-Paper
Advertisement

2026 Telugu Movies: ఈ ఏడాది సినిమాల జాతర మామూలుగా లేదుగా… ఎప్పుడూ లేనంతగా..!

2026 Telugu Movies: ఈ ఏడాది సినిమాల జాతర మామూలుగా లేదుగా… ఎప్పుడూ లేనంతగా..!
Advertisement

Upcoming Telugu films 2026: తెలుగు సినిమా అభిమానులకు 2026 సంవత్సరం నిజంగానే ఒక పండగ లాగా మారబోతోంది. సంవత్సరం మొదటి నుంచే స్టార్ హీరోల భారీ సినిమాలు బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాల జాబితా చూస్తే సినీ ప్రేమికులు కూడా షాక్ అవ్వాల్సిందే.

సంక్రాంతి నుంచి మొదలు..!

సంక్రాంతి బరిలో మొదటగా ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ జనవరి 9, 2026న థియేటర్లకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ హారర్ కామెడీపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ కొంచెం ఎంటర్టైనింగ్ పాత్ర చేయనుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

Advertisement

దీని వెంటనే జనవరి 12న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కూడా పండగ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్లాప్ అంటే తెలియని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి చిరంజీవి కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారని ఫ్యాన్స్ నమ్మకం. పైగా అనిల్ రావిపూడి చిరంజీవి లది ఒక క్రేజీ కాంబో అని చెప్పచ్చు.

ఫిబ్రవరిలో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘స్వయంభూ’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. కార్తికేయ 2 తో ఇండియా మొత్తం మీద పాపులర్ అయిపోయిన నిఖిల్ ఈ చిత్రంలో యోధుడిగా నిఖిల్ కనిపించనున్నారు. ఈ సినిమాలో సమ్యుక్తా మీనన్, నభా నటేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా యాక్షన్, చారిత్రక నేపథ్యంతో ఉండనుందని సమాచారం.

Advertisement

మార్చి నెల అయితే అసలైన బాక్స్ ఆఫీస్ ఫైట్‌కు సిద్ధం అవుతుంది. మార్చిలో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ విడుదల కానుంది. మార్చి 26న ఒకేసారి రెండు పెద్ద సినిమాలు క్లాష్ అవుతున్నాయి. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ తో నాని నటించిన ‘ది పారడైస్’ ఢీ కొట్టనుంది. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఆసక్తికరంగా మారనుంది.

స్టార్ హీరోల హవా..!

అదే సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఇదే సీజన్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మార్చిలో తెలుగులోకి డబ్ అవుతున్న ‘ధురంధర్ 2’ కూడా భారీ ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేవు.

వేసవిలో చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ జూన్ 2026లో రావచ్చని అంచనాలు ఉన్నాయి. అలాగే బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా కూడా 2026లోనే విడుదలయ్యే అవకాశముంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ 2026లో వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.

అయితే ఈ ఏడాది మాత్రం అల్లు అర్జున్, మహేష్ బాబు.. ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్ సినిమాలు థియేటర్లకు రాకపోవడం ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తోంది. అయితే మిగతా హీరోల అభిమానులకి మాత్రం ఈ ఏడాది భారీ సినిమాలు ఫుల్ మీల్స్ లాగానే మారనున్నాయి. ఇందులో ఎన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను మోత మోగిస్తాయో వేచి చూడాలి.

ALSO READ: Tollywood: సంక్రాంతి టార్గెట్ 1000 కోట్లు… అప్పుడే టాలీవుడ్ సేఫ్

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×