Health Insurance: సాధారణంగా ఒక కుటుంబానికి రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ సరిపోతుందనే ప్రచారం ఉంది. కానీ వైద్య ఖర్చులు పెరుగుతున్న తీరును చూస్తే, ప్రధాన నగరాల్లో, హార్ట్ సర్జరీలు, క్యాన్సర్లు, ఇతర వైద్య చికిత్సలకు ఈ మొత్తం సరిపోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏయోన్ గ్లోబల్ మెడికల్ ట్రెండ్ రేట్స్ నివేదిక ప్రకారం, దేశంలో వైద్య ద్రవ్యోల్బణం ఏటా 12% నుంచి 13% వరకు పెరుగుతుంది. లేటెస్ట్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ తో హాస్పిటల్ బిల్లులు పెరుగుతున్నాయి. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ రూ.10 లక్షల లిమిట్ సరిపోదని నిపుణులు అభిప్రాయం.
Vo2: ఇండస్‌ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ రాకేష్ జైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిపై స్పందిస్తూ.. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా బేసిక్ లెవల్ అన్నారు. వైద్య ఖర్చులు, అధునాతన చికిత్సల కారణంగా మెట్రో నగరాల్లో ఇది మొత్తం సరిపోకపోవచ్చు అన్నారు. హెల్త్ పాలసీలపై సూపర్ టాప్-అప్‌లు తీసుకోవాలని సూచించారు. వయస్సు, నగరం, జీవనశైలికి సంబంధించిన హెల్త్ రిస్క్ లను అంచనా వేసుకుని హెల్త్ కవరేజీని పెంచుకోవాలని సూచించారు.
మెట్రో నగరాల్లో ఐసీయూ లేదా సాధారణ సర్జరీకైనా రూ. 5 నుంచి 7 లక్షల వరకు ఖర్చవుతుంది. తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ లేకపోతే.. వైద్య ఖర్చులకు ఉన్న సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఖాళీ అవుతాయి. ఆస్తులను అమ్మడమో లేదా ఎక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ తీసుకోవడమో చేయాలి. తక్కువ ఆదాయం, స్వయం ఉపాధి పొందుతున్న వాళ్లను ఈ ఖర్చులు అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. అందుకే కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వాళ్లు ఈ 6 అంశాలు గుర్తుపెట్టుకోవాలని ఎక్స్ ఫర్ట్స్ సూచిస్తున్నారు.
వృద్ధులకు ముఖ్యంగా 75 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మెట్రో నగరాల్లో రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ సరిపోకపోవచ్చు. అటువంటి వారికి రూ.15 నుంచి రూ.25 లక్షల కవరేజీ+ టాప్ అప్ పాలసీ తీసుకోవాలని ఎక్స్ ఫర్ట్స్ సూచిస్తు్న్నారు.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లోని ఆసుపత్రులలో రోబోటిక్ సర్జరీలు, రూమ్ రెంట్ లు, అధునాతన స్కానింగ్ లకు ఎక్కువ ఖర్చు అవుతుంది. సిటీల్లో వైద్య ఖర్చులు, లైఫ్ స్టైల్ ను దృష్టిలో ఆరోగ్య బీమా కవరేజీ పెంచుకోవాల్సి ఉంటుంది.
ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు వెయిటింగ్ పీరియడ్, మినహాయింపులు, రిస్టోరేషన్ ను సమీక్షించుకోవాలి. ప్రస్తుతం హెల్త్ కండీషన్, వైద్య సహాయం అవసరాన్ని బట్టి పాలసీని సెలెక్ట్ చేసుకోండి.
Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు చెక్ చేయండి
కో-పేమెంట్ నిబంధనలు, రూమ్ రెంట్, చికిత్స పరిమితులను ముందుగా చెక్ చేసుకుని పాలసీని సెలెక్ట్ చేసుకోండి.
5.నెట్‌వర్క్ హాస్పిటల్స్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రికార్డ్
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కంపెనీ సర్వీస్ గురించి తనిఖీ చేయండి. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్, హై క్లెయిమ్ సెటిల్‌మెంట్, కస్టమర్ రివ్యూస్ తెలుసుకోండి.
ఇన్సూరెన్స్ కవరేజీ ఆటో రెస్టోరేషన్, టాప్ ఆప్ అందించే ఆరోగ్య బీమా పాలసీలను ఎంచుకోండి. ఇలా చేస్తే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తట్టుకుంటుంది.
అయితే రూ.10 లక్షల పాలసీ అవసరమా? అనేది కస్టమర్ వ్యక్తిగత నిర్ణయం. పాలసీ తీసుకునే ముందు వ్యక్తిగత వైద్యుడు, నిపుణుల సలహా తీసుకుంటే బెటర్.