Skinny Jeans: ఒకప్పుడు భారతదేశ స్త్రీలు చీరలు మాత్రమే ధరించేవారు. కొంతకాలానికి బ్రిటిష్ పాలన, ఆధునిక సమాజంలో మార్పుల కారణంగా ఫ్యాషన్ రంగం వృద్ధి చెందడంతో.. పాశ్చాత్యులు వాడే జీన్స్ సంస్కృతి పలు దేశాలకు పాకింది. దీనిలో భాగంగానే భారతదేశంలోనూ జీన్స్ ట్రెండ్ మొదలైంది. ప్రస్తుతం అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా జీన్స్ ధరించడాన్ని ఇష్టపడుతున్నారు. అయితే, అమ్మాయిలు ఒంటికి అతుక్కునే జీన్స్ ప్యాంట్లు, స్కిన్నీ జీన్సులు ధరించడం ద్వారా యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారని ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ తె లిపింది. ఈ నేపథ్యంలో స్కిన్నీ జీన్స్ వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.
అమ్మాయిలు తరచూ ఒంటికి అతుక్కుపోయే జీన్సులను ధరించడం ద్వారా మూత్రం రాకపోయినా తరచూ వస్తున్నట్లు అనిపిస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, యూరిన్‌కు వెళ్లినప్పుడు మంటగా అనిపించడం వంటివి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ల ఇన్‌ఫెక్షన్ల కిందకే వస్తాయట. అటు అమ్మాయిలైనా ఇటు అబ్బాయిలైనా టైట్ జీన్స్ ధరిండచం ద్వారా పొత్తి కడుపు దగ్గర, నడుం నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువట. తప్పని పరిస్థితుల్లో ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలంటే.. వారానికి రెండు సార్లు మాత్రమే జీన్స్ ధరించడం ఉత్తమం.
* సింథిటిక్ క్లాత్ ప్యాంట్లు, లోదుస్తులు బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. గాలి ఆడకుండా తేమని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
* స్కిన్నీ జీన్స్, జిగుతుగా ఉండే లోదుస్తులు తరచూ ధరించడం వల్ల మగవారిలో వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుందని అధ్యయనాల్లో తేలింది.
* స్కిన్నీ జీన్స్ ధరిస్తే కాళ్లు, తొడలకు రక్త సరఫరా వేగం తగ్గుతుంది. దీంతో కాళ్లు తిమ్మిర్లు పడతాయి. అంతే కాదు.. చర్మ సమస్యలూ వస్తాయి.
జీన్స్ ప్యాంట్ల కంటే.. ఫార్మల్స్, లెనిన్ ప్యాంట్లను ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవి వదులుగా ఉండటం వల్ల చర్మానికి హాయిగా ఉంటుంది. ఈ ప్యాంట్లను మెయింటైన్ చెయ్యడం కూడా తేలికే. జీన్సే కావాలనుకుంటే.. జీన్స్ రకాల్లో.. వైడ్ లెగ్, కఫ్‌డ్, బూట్‌కట్, ఫ్లేర్స్, కార్గో, క్రాప్‌డ్ జీన్స్ వంటి వాటిని ఎంచుకోవడం ఉత్తమం. అందులోనూ.. కాటన్ జీన్స్ ఎంచుకుంటే ఇంకా మంచిది. కాటన్ జీన్స్ ధరించడం వల్ల శరీరం నుంచి వచ్చే చెమటను బయటకు పంపేందుకు అవకాశం ఉంటుంది. జీన్స్ ధరించి ఏదైనా పని మీద బయటకు వెళ్లి వస్తే.. వెంటనే వాటిని తీసేసి వదులుగా ఉండే బట్టలు ధరించాలి. గర్భిణీ స్త్రీలు, యువత జీన్స్ వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం.