E-Paper
Advertisement

Tips For Hair Fall: హెన్నాలో ఈ 4 కలిపి రాస్తే.. జుట్టు అస్సలు రాలదు

Tips For Hair Fall: హెన్నాలో ఈ 4 కలిపి రాస్తే.. జుట్టు అస్సలు రాలదు

Tips For Hair Fall: మహిళలు అందంగా కనిపించడంతో జుట్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉంటే మీ అందం రెట్టింపు అవుతుంది. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో పాటు ఆరోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కవవుతోంది. ఇదిలా ఉంటే చుండ్రు సమస్య కూడా జుట్టు రాలడానికి కారణం అవుతోంది.

చుండ్రు వల్ల తలపై దురద కూడా పెరుగుతోంది. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని రకాల హోం రెమెడీస్ ప్రభావవంతగా పనిచేస్తాయి. ఇవి జుట్టుకు కావలసిన పోషణను అందించడమే కాకుండా జుట్టును బలంగా , ఒత్తుగా మారుతస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెన్నా:

హెన్నా జుట్టుకు రంగను మార్చడమే కాదు. జుట్టుకు అవసరమైన పోషణను కూడా అందిస్తుంది. హన్నా జుట్టుకు డార్క్ కలర్ ఇవ్వడంతో పాటు చుండ్రు నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. హెన్నా గురించి చాలా మందికి తెలయని విషయం ఏమిటంటే ఇది శీలింధ్ర నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రును తగ్గించడంలో ప్రభావవంతగా పనిచేస్తుంది.

ఎలా ఉపయోగించాలి ?
హెన్నా పొడిని నీళ్లలో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని మీ జుట్టు, కుదుళ్లకు అప్లై చేసి 2-3 గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పూర్తిగా కడిగేయాలి.

1. పెరుగు:
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కాల్ప్ ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. చుండ్రును తగ్గించడంతో పాటు జుట్టుకు తేమను అందిస్తుంది.

ఎలా ఉపయోగించాలి ?
1 కప్పు పెరుగులో 2 టీస్పూన్ల నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ హెన్నా కలపండి. తర్వాత దీనిని తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత షాంపూతో కడగాలి

2. ఆమ్లా :
ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి జుట్టును బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా నెరిసిన జుట్టు సమస్యను కూడా తగ్గిస్తాయి. ఇది వెంట్రులకు శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా రిఫ్రెష్ చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి ?

4 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని నీళ్లలో కలిపి పేస్ట్‌లా అందులోనే 2 టేబుల్ స్పూన్ల హెన్నా వేసి మిక్స్ చేసుకోవాలి. దీనిని జుట్టుపై అప్లై చేసి 1 గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.

3. నిమ్మరసం :
నిమ్మరసం సహజమైన యాంటీ ఫంగల్ , యాంటీ బ్యాక్టీరియల్ రెమెడీ. ఇది స్కాల్ప్ నుండి మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడానికి కారణం అయ్యే సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఎలా ఉపయోగించాలి?
1 నిమ్మకాయ రసాన్ని తీసి, అందులో 2 టేబుల్ స్పూన్ల హెన్నాతో పాటు నీరు వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి నేరుగా తలకు పట్టించాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై తలస్నానం చేయాలి.

4. షికాకై:
ఇది జుట్టు సంరక్షణకు ఉపయోగించే పురాతన ఔషధాలలో ఒకటి. జుట్టును శుభ్రపరచడంతోపాటు, వాటిని మందంగా చేయడంలోనూ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

Also Read:  హెన్నాలో ఈ ఒక్కటి కలిపితే జుట్టు బాగా పెరుగుతుంది తెలుసా ?

ఎలా ఉపయోగించాలి ?
3 టేబుల్ స్పూన్ల షికాకాయ్ పొడిలో తగినంత నీరు, 2 టేబుల్ స్పూన్ల హెన్నా వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.

చుండ్రును ఎలా తగ్గించాలి ?
ఉసిరి పొడి, పెరుగు, నిమ్మ, కలబంద వంటి సహజ పదార్థాలతో హెన్నాను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల మూలాల నుండి చుండ్రును తొలగించుకోవచ్చు. ఈ రెమెడీలు చుండ్రును తొలగించడమే కాకుండా, జుట్టును ఒత్తుగా, నల్లగా, బలంగా మార్చుతాయి. వీటిని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుతుంది. అంతే కాకుండా జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×