BigTV English
Advertisement

Indian Railway New Rules: రైల్లో పెద్ద పెద్దగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారా? అయితే, ఈ శిక్ష తప్పదు

Indian Railway New Rules: రైల్లో పెద్ద పెద్దగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారా? అయితే, ఈ శిక్ష తప్పదు

Indian Railways: దేశ వ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది రైల్లో ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చు, సౌకర్యవంతంగా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. రైల్వే ప్రయాణం ఆహ్లాదకరంగా సాగేందుకు భారతీయ రైల్వే సంస్థ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇబ్బందులు లేకుంగా ప్రయాణీకులు జర్నీ చేసేందుకు చాలా నిబంధనలు అమలు చేస్తున్నది. అందులో భాగంగా రాత్రి వేళ్లలో ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా కొన్ని రూల్స్ అమలు చేస్తున్నది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలసుకునే ప్రయత్నం చేద్దా..


రాత్రివేళ్లలో రైల్లో అమలయ్యే నిబంధనలు

రాత్రిపూట రైళ్ల ప్రయాణీకులు కొన్ని నిబంధనలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా వ్యవహరించాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవని భారతీయ రైల్వే నిబంధనలు వెల్లడిస్తున్నాయి. రాత్రి వేళలో ప్రయాణీకులు ప్రశాంతంగా నిద్రపోయేలా చేయడానికి కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నది. వాటిలో ముఖ్యమైని ఇవే..


*రాత్రి వేళ్లలో సెల్ ఫోన్లలో సౌండ్ ఎక్కువగా పెట్టి మ్యూజిక్ వినకూడదు. ఒకవేళ సంగీతం వినాలనే ఆసక్తి ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. లేదంటే పక్కవారికి ఇబ్బంది కలగకుండా సౌండ్ తగ్గించాలి.

*మీకు కేటాయించిన బెర్త్, లేదంటే కంపార్ట్ మెంట్, లేదంటే కోచ్ లో ఫోన్ లో గట్టిగా మాట్లాడ్డం, కేకలు వేయడం నిషేధం.

*రైల్లో రాత్రి పూట గ్రూప్ డిస్కషన్లు చేయకూడదు. కాదని  అలాగే మాట్లాడితే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

*రాత్రి 10 గటంల తర్వాత ప్రయాణీకులు రైల్లో లైట్లు ఆఫ్ చేయాలి. అవసరం అనుకుంటే నైట్ లైట్స్ వినియోగించాలి.

*రాత్రిపూట ప్రయాణించే ప్యాసెంజర్లు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలి. ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే రైల్వే అధికారులు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. వ్యవహారం కాస్త సీరియస్ గా ఉంటే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.

*రైల్లో ప్రయాణీకులు రాత్రి పూట నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని TTEతో పాటు ఇతర రైల్వే సిబ్బంది గమనిస్తూ ఉంటారు. వాళ్లు నిబంధలను అతిక్రమించినట్లు అనిపిస్తే తగిన చర్యలు తీసుకుంటారు.

*ఒకవేళ ఎవరైనా ప్రయాణీకులకు రాత్రి పూట తోటి ప్రయాణీకులతో ఇబ్బంది కలిగితే TTE విషయాన్ని చెప్పి, సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.

Read Also:రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు ఎందుకు తగ్గించారు? అసలు కారణం ఇదేనా?

*ప్రయాణీకులు భారతీయ రైల్వేకు సంబంధించి AI ఆధారిత రైల్‌ మిత్ర అప్లికేషన్‌ ను ఉపయోగించడం మంచింది. ప్రయాణీకుల రైలు షెడ్యూల్, PNR స్టేటస్, రైలు ప్రస్తుతం నడుస్తున్న ప్రదేశం, ఫుడ్ ఆర్డర్ చేయడంతో పాటు  ఫిర్యాదులను కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది.

అర్థరాత్రి వరకు కంపార్ట్ మెంట్లలో గట్టిగా మాట్లాడ్డంతో పాటు ఇతరకుల నిద్రకు భంగం కలిగిస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో భారతీయ రైల్వే పలు నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. వాటిని చాలా రైళ్లలో కఠినంగా అమలు చేస్తున్నారు.

Read Also: రైల్లో ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇవేం రూల్స్ అండి బాబు.. చంపేస్తారా?

Related News

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Jiomart Offers: నవంబర్‌లో ఆఫర్ల వర్షం.. జియోమార్ట్‌లో సూపర్ డీల్స్ వచ్చేశాయ్..

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Dak Sewa App: ఇక మీ పాకెట్ లో పోస్ట్ ఆఫీస్ సేవలు.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన తపాలాశాఖ

Gold Rate Dropped: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గాయంటే..

Jio Offer: జియో కస్టమర్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ఎన్ రోల్మెంట్ స్కీమ్.. మీరు అర్హులేనా?

Big Stories

×