E-Paper
Advertisement

Papaya Face Pack: మీరు తెల్లగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Papaya Face Pack: మీరు తెల్లగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి
Advertisement

Papaya Face Pack: ముఖం అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందుకోసం ముఖ్యంగా రకరకాల క్రీములను వాడుతుంటారు. బయట మార్కెట్లో దొరికే ఫేస్ ప్రొడక్ట్స్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే రసాయనాలతో తయారు చేసిన ఫేస్ క్రీములను వాడకుండా ఉండాలి. వీటికి బదులుగా హోం మేడ్ ప్రొడక్స్ట్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. పండ్లతో కూడా ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడటం వల్ల ఫలితం ఉంటుంది.

తాము తెల్లగా , అందంగా లేమని చాలా మంది ఆందోళన చెందుతారు. సాధారణంగా ప్రతి ఒక్కరి ముఖం రోజు జిడ్డుగా మారుతుంది. అంతే కాదు ఆయిల్ స్కిన్ ఉన్న వారి ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు మొదలవుతాయి. అలాంటి వారు ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల ముఖం అందంగా మారుతుంది.

Advertisement

ముఖ్యంగా బొప్పాయి ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పండు ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్లు, పీచు వంటి పోషకాలు మన శరీరానికి మేలు చేస్తాయి. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల జిడ్డు చర్మం సమస్యను నయం చేయడమే కాకుండా మీ ముఖంపై టానింగ్ కూడా తొలగిపోతుంది.మీరు జిడ్డు చర్మం కలిగి ఉంటే చర్మ సంరక్షణ కోసం పోషకాలు అధికంగా ఉండే బొప్పాయి ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బొప్పాయితో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బొప్పాయితో  ఫేస్ ప్యాక్ లు
1. అలోవెరా, బొప్పాయి ఫేస్ ప్యాక్:

Advertisement

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా 1 చిన్న కప్పు బొప్పాయి ముక్కలను తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. దానికి 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసి కలపండి. తర్వాత దీనిని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

2. ముల్తానీ మిట్టి, బొప్పాయి ఫేస్ ప్యాక్:
కొన్ని బొప్పాయి ముక్కలను తీసుకుని పేస్ట్ లాగా చేసుకోండి. అందులోనే ఒక చెంచా ముల్తానీ మిట్టి పొడి, రోజ్ వాటర్ వేసి కలపాలి. దీనిని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత దీనిని ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకోండి. 15 నిమిషాల పాటు ఉంచి, శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. బొప్పాయి , ముల్తానీ మిట్టి ముఖంపై మచ్చలను తగ్గిస్తాయి.

Also Read: ఈ ఫేస్ ప్యాక్‌‌తో ముఖంపై మొటిమలు మాయం

3. బొప్పాయి, తేనె ప్యాక్:
బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్ చేయడానికి, ముందుగా 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి ముక్కల పేస్టును తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ తేనెను వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి కనీసం 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. చివరగా శుభ్రమైన నీటితో కడగేయండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×