BigTV English

RajaSaab: మారుతి బర్త్ డే స్పెషల్ వీడియో.. వింటేజ్ లుక్ లో డార్లింగ్ ఏమున్నాడ్రా బాబు

RajaSaab: మారుతి బర్త్ డే స్పెషల్ వీడియో.. వింటేజ్ లుక్ లో డార్లింగ్ ఏమున్నాడ్రా బాబు

RajaSaab: ఈరోజుల్లో అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టాడు డైరెక్టర్ మారుతి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న మారుతి.. ఆ తరువాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో మంచి డైరెక్టర్ గా గుర్తింపును అందుకున్నాడు. బస్టాప్, ప్రేమ కథా చిత్రం, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, ప్రతి రోజు పండగే.. లాంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన మారుతి.. చివరగా పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మారుతికి ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయింది.


ఇక ఈ సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న మారుతి సైలెంట్ గా ప్రభాస్ తో సినిమాను ఓకే చేయించుకొని ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. సలార్ కన్నా ముందే ప్రభాస్- మారుతి సినిమా పట్టాలెక్కింది. ఆ సినిమానే రాజాసాబ్. గత కొన్ని నెలల క్రితమే రాజాసాబ్ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రాజాసాబ్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఇకపోతే నేడు డైరెక్టర్ మారుతి పుట్టినరోజు కావడంతో.. రాజాసాబ్ టీమ్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. రాజాసాబ్ షూటింగ్ లో మారుతి పడుతున్న కష్టాన్ని చూపించారు. ఇక ఈ వీడియో చివర్లో ప్రభాస్, మారుతి కలిసి ఉన్న క్లిప్  హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


రాధే శ్యామ్ తరువాత  ప్రభాస్ అన్ని యాక్షన్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ఇక రాజాసాబ్ వాటికి చాలా దూరంగా  హర్రర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. దీంతో ప్రభాస్ నుంచి  ఇలాంటి జోనర్ ను ఊహించని అభిమానులు.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్  అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో మారుతి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×