E-Paper
Advertisement

Homemade Hair Oils: జుట్టు రాలడాన్ని తగ్గించే.. హెయిర్ ఆయిల్స్ ఇవే

Homemade Hair Oils: జుట్టు రాలడాన్ని తగ్గించే.. హెయిర్ ఆయిల్స్ ఇవే
Advertisement

Homemade Hair Oils: ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపంతో పాటు, మారుతున్న జీవనశైలి కూడా జుట్టు రాలడానికి కారణం.

ఇదిలా ఉంటే రాలుతున్న జుట్టు చూస్తే చాలా బాధగా ఉంటుంది. అందుకే చాలా మంది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. ఇందుకోసం వేలల్లో ఖర్చు చేసేవారు కూడా లేకపోలేదు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా న్యాచురల్ ఆయిల్ తో జుట్టు బాగా పెరుగుతుంది.

Advertisement

కొబ్బరి నూనె, కరివేపాకు, మెంతి గింజలను కలిపి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. కరివేపాకులో విటమిన్లు, ప్రొటీన్లు , యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా ఈ ఆయిల్ తయారీకి వాడుతున్న మెంతులు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి.

ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఇలా తయారు చేసుకోండి:

Advertisement

కావలసినవి:

కొబ్బరి నూనె- 250 గ్రాములు
కరివేపాకు – ఒక చిన్న కప్పు
మెంతి గింజలు- 3 టేబుల్ స్పూన్లు
కలబంద- ఒక చిన్న కప్పు

Also Read: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

తయారీ విధానం: ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మందపాటి గిన్నెను గ్యాస్‌పై పెట్టుకోవాలి. ఆ తర్వాత పైన చెప్పిన మోతాదులో కొబ్బరి నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత కరివేపాకు. మెంతి గింజలతో పాటు కలబంద వేసి 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆయిల్‌ను చల్లార్చాలి. అనంతరం ఒక డబ్బాలో వడకట్టుకుని నిల్వ చేసుకోవాలి.

ఇంట్లో తయారుచేసిన ఈ నూనెను వారానికి 2 రోజులు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. కొద్ది రోజుల్లోనే వెంట్రుకలు పెరగడం మొదలవుతాయి. అంతే కాకుండా జుట్టు బలంగా మారుతుంది. కొత్త జుట్టు రాలడానికి ఈ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

Big Stories

Advertisement
×