E-Paper
Advertisement

Harshasai: ‘దిశ’ యాప్‌‌ను ప్రమోట్ చేసిన హర్ష సాయి.. అత్యాచార ఆరోపణలతో పోలీసుల కీలక నిర్ణయం

Harshasai: ‘దిశ’ యాప్‌‌ను ప్రమోట్ చేసిన హర్ష సాయి.. అత్యాచార ఆరోపణలతో పోలీసుల కీలక నిర్ణయం
Advertisement

Police Cancelled Agreement of Disha APP Promotion with Harshasai: సోషల్ మీడియాతో సినిమా రేంజ్ లో తెగ పాపులైరన యూట్యూబర్ హర్షసాయి ఎపిసోడ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తనని హర్షసాయి ప్రేమపేరుతో మోసం చేశాడంటూ పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి నెటిజన్స్ షాకయ్యారు. ఈ క్రమంలో హర్షసాయికి ఏపీ పోలీసులు భారీ షాకిచ్చారు. గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేశారు. దిశా యాప్ ప్రమోషన్ కు హర్షసాయితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే, ఇప్పుడు లైంగిక దాడి కేసులో హర్షసాయి నిందితుడిగా ఉండడంతో ఆ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు ఏపీ పోలీసులు.

Also Read: చంద్రబాబు సర్కార్‌‌పై బీజేపీ ఒత్తిడా? రాజాసింగ్ కొత్త డిమాండ్, ఏమిటి?

Advertisement

ఇదిలా ఉంటే.. హర్షసాయి తనను ప్రేమ పేరుతో మేసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి లొంగదీసుకున్నాడని, చివరకు చేతులు ఎత్తేశాడని, అదేవిధంగా రూ. 2 కోట్ల వరకు డబ్బులు కూడా తీసుకున్నాడంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నది. ఆమె ఫిర్యాదు మేరకు మంగళవారం నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం హర్షసాయి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఈ విషయమై హర్షసాయి ఓ వీడియోను విడుదల చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సదరు యువతి కేవలం డబ్బుల కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని, తనేమిటో తన అభిమానులకు తెలుసంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. దీనిపై త్వరలోనే అన్ని బయటపడుతాయని, ఈ విషయమై ఇకపై తన లాయర్ మాట్లాడుతారంటూ హర్షసాయి ఆ వీడియోలో పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

కాగా, ఈ కేసుకు సంబంధించిన సదరు యువతికి, హర్షసాయికి మధ్య జరిగిన పలు ఫోన్ కాల్స్ సంభాషణలకు సంబంధించిన రికార్డింగ్స్ లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఆ ఆడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. రెండు కాల్స్ కు సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఈ ఆడియోలను ఆ యువతి పోలీసులకు అందించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మరిన్ని ఆధారాలను కూడా పోలీసులు కోరినట్లు సమాచారం.

Also Read: జనసేనలో వైసీపీ నేతల చేరిక వెనుక భారీ కుట్ర? కూటమిలో కుదుపులు ఖాయం!

ఈ క్రమంలోనే ఏపీ పోలీసులు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దిశా యాప్ ప్రమోషన్స్ విషయమై హర్షసాయితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. ఈ మేరకు పోలీసులు ప్రకటన చేశారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×