E-Paper
Advertisement

Herbal Hair Oil: ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్‌తో.. జుట్టు పెరగడం గ్యారంటీ

Herbal Hair Oil: ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్‌తో.. జుట్టు పెరగడం గ్యారంటీ
Advertisement

Herbal Hair Oil: ప్రస్తుతం జుట్టు సంబంధిత సమస్యలు చాలా మందికి సర్వ సాధారణంగా మారాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా జుట్టు రాలే సమస్యలను ఎదుర్కుంటున్నారు. జుట్టు రాలడానికి మారుతున్న జీవనశైలితో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. రాలే జుట్టుతో ఇబ్బంది పడుతున్న వారు బయట దొరికే హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.

అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలోనే హెర్బల్ హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది. మందార, కొన్ని సహజమైన వస్తువులను మిక్స్ చేసి తయారు చేసిన నూనె జుట్టును బలంగా , ఒత్తుగా మార్చుతుంది. దీని ప్రయోజనాలు, తయారుచేసే విధానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ?

కావలసినవి:

Advertisement

మందారపూలు- 4-5
కొబ్బరి నూనె- 250 గ్రాములు
మెంతులు- 4-5 టీ స్పూన్లు
ఉసిరికాయలు- 3

ఈ నూనెను ఎలా తయారు చేయాలి ?

బాణలిలో కొబ్బరి నూనె మెంతి గింజలు, మందార పువ్వులు, ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి చేయాలి. ఈ ఆయిల్‌ను 15 నిమిషాల పాటు చిక్కగా అయ్యే వరకూ వేడి చేయాలి. తర్వాత దీనిని చల్లార్చి వడకట్టి సీసాలో నింపాలి.

ఈ నూనెను ఎలా అప్లై చేయాలి ?
ఈ నూనెను మీ జుట్టుకు వారానికి రెండుసార్లు రాయండి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం షాంపూతో వాస్ చేయండి.

మెంతులు, మందార, ఉసిరి, కొబ్బరి నూనె యొక్క ప్రయోజనాలు: 

జుట్టు పెరుగుదల:  మెంతిగింజల్లో ప్రోటీన్ , నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మందారలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి జుట్టును రక్షిస్తాయి. కొబ్బరి నూనె జుట్టుకు పోషణనిచ్చి తేమను అందిస్తుంది.

చుండ్రును వదిలించుకోండి:  మెంతులు , ఉసిరిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి.

జుట్టు రాలడం:  మెంతులు, మందారం జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

జుట్టు మెరుస్తుంది:  కొబ్బరినూనె, మందారం జుట్టును మెరిసేలా చేస్తాయి .

స్కాల్ప్ సమస్యలు : ఉసిరికాయ, కొబ్బరి నూనె స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా దురద, మంట వంటి సమస్యలను తగ్గిస్తాయి.

Also Read; కరివేపాకుతో హెయిర్ మాస్క్.. ఇది వాడితే జుట్టు రాలే సమస్యే ఉండదు

ఈ నూనె యొక్క ఇతర ప్రయోజనాలు: 

ఈ నూనె జుట్టుకు సహజ రంగును ఇస్తుంది.

ఇది జుట్టును సిల్కీగా, మృదువుగా చేస్తుంది.

ఇది UV కిరణాల నుండి జుట్టును రక్షిస్తుంది .

ఇది చుండ్రుపు పూర్తిగా తగ్గిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×