BigTV English

Curry Leaves Hair Mask: కరివేపాకుతో హెయిర్ మాస్క్.. ఇది వాడితే జుట్టు రాలే సమస్యే ఉండదు

Curry Leaves Hair Mask: కరివేపాకుతో హెయిర్ మాస్క్.. ఇది వాడితే జుట్టు రాలే సమస్యే ఉండదు

Curry Leaves Hair Mask: జుట్టు రాలే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ రోజుల్లో కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు సంబంధిత సమస్యలు సర్వసాధారణంగా మారాయి. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు సర్వ సాధారణమైపోయాయి. ఇలాంటి సమయంలోనే మీ జుట్టును దృఢంగా, సిల్కీగా మార్చేందుకు కొన్ని రకాల హోం రెమెడీస్ వాడవచ్చు. వీటి వల్ల అనేక లాభాలు ఉంటాయి.


కరివేపాకు ఆరోగ్యానికే కాదు, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను ఇచ్చి బలపరుస్తాయి. కరివేపాకుతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌లు కూడా జుట్టును బలంగా, సిల్కీగా కూడా చేస్తాయి. కరివేపాకుతో హెయిర్ మాస్కులు ఎలా తయారు చేయాలి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు:


కరివేపాకు హెయిర్ మాస్క్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి.

కరివేపాకు జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది. కరివేపాకు జుట్టుకు సహజ నూనెను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టును మెరిసేలా చేస్తుంది.

చుండ్రును తొలగిస్తుంది: కరివేపాకులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి.

జుట్టుకు సహజ రంగును ఇస్తుంది: కరివేపాకు జుట్టుకు సహజ రంగును ఇస్తుంది. అంతే కాకుండా చిన్న వయస్సులో వచ్చే తెల్ల జుట్టును ఆపేస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: కరివేపాకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా జుట్టును పొడవుగా మందంగా చేస్తుంది.

కరివేపాకుతో  హెయిర్ మాస్క్‌లు..

1. కరివేపాకు, పెరుగు హెయిర్ మాస్క్:
కావలసినవి:
కరివేపాకు – 1కప్పు
పెరుగు- 1/2 కప్పు

తయారీ విధానం: కరివేపాకును గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో పెరుగు మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.

ప్రయోజనాలు: ఈ మాస్క్ జుట్టును తేమగా చేసి మృదువుగా మారుస్తుంది.

2. కరివేపాకు, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్:
కావలసినవి:
కరివేపాకు పేస్ట్- 1 కప్పు
కొబ్బరి నూనె- 1/2 కప్పు

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదులో కొబ్బరి నూనెను కరివేపాకు పేస్ట్‌లో మిక్స్ చేసి మీ జుట్టు యొక్క మూలాలకు అప్లై చేయండి. తర్వాత మృదువుగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం షాంపూతో వాష్ చేయాలి.

ప్రయోజనాలు: ఈ మాస్క్ జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

Also Read: మీ జుట్టు సిల్కీగా మారిపోవాలా ? అయితే ఇవి వాడండి

3. కరివేపాకు, గుడ్డు హెయిర్ మాస్క్:
కావలసినవి:
కరివేపాకు పేస్ట్- 1 కప్పు
గుడ్డు- 1
తయారీ విధానం: కరివేపాకు పేస్ట్‌లో గుడ్డు మిక్స్ చేసి మీ జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయాలి.
ప్రయోజనాలు: ఈ మాస్క్ జుట్టుకు పోషణనిచ్చి మెరిసేలా చేస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Makhana: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !

Stress: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Big Stories

×