E-Paper
Advertisement

Honey Face Packs: 40 ఏళ్లలో కూడా యంగ్‌‌గా కనిపించాలా ?

Honey Face Packs: 40 ఏళ్లలో కూడా యంగ్‌‌గా కనిపించాలా ?

Honey Face Packs: తేనెలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే తేనెను మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. తేనె ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనెతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల అందం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా 40 ఏళ్లు పై బడిన వారు ఈ ఫేస్ ప్యాక్‌లను వాడటం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.

వయస్సు పెరుగుతున్నా కూడా యంగ్‌గా కనిపించాలి అంటే తేనెతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను వాడాలి. వీటి వల్ల అనేక లాభాలు ఉంటాయి. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు వయస్సు పెరుగుతున్నా కూడా అందంగా కనిపించేలా చేస్తాయి.

తేనెలో పసుసు, నిమ్మ రసం, పెరుగు , ఓట్స్‌లను కలిపి ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకుని వాడవచ్చు. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలి. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. తేనె, పెరుగు ఫేస్ ప్యాక్:

కావలసినవి:

తేనె- 1 టేబుల్ స్పూన్
పెరుగు- 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా పైన చెప్పిన మోతాదులో తేనె, నిమ్మరసం తీసుకుని వాటిని ఒక గిన్నెలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ఫేస్ పై అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల పాటు దీనిని ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను తరుచుగా ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం అందంగా మెరిసిపోతుంది. ముఖంపై ఉన్న ట్యాన్ తొలగిపోతుంది. అంతే కాకుండా ఫేస్‌పై ఉన్న మృత కణాలను ఈ ఫేస్ ప్యాక్ తొలగిస్తుంది. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.

2. తేనె, నిమ్మకాయ ఫేస్ ప్యాక్:
ఒక గిన్నెలో ఒక చెంచా తేనె, అర చెంచా నిమ్మరసం కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ మచ్చలను తగ్గిస్తుందిచ. అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. దీని వల్ల మొటిమలు కూడా తగ్గుతాయి.

3. తేనె, పసుపు ఫేస్ ప్యాక్:
పసుపు, తేనెతో చేసిన ఫేస్ ప్యాక్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెండింటిలోనూ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దీని ఫేస్ ప్యాక్ కోసం, ఒక గిన్నెలో ఒక చెంచా తేనె, 1/4 చెంచా పసుపు కలపండి. దీనిని పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను మొత్తం ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడగండి. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ ఇన్ఫెక్షన్‌ని తొలగించి, ముఖానికి మెరుపునిస్తుంది.

Also Read: వీటితో ఫేస్‌పై ఉన్న జిడ్డు మాయం

4. తేనె, ఓట్స్ ఫేస్ ప్యాక్:
ఓట్స్, తేనెతో చేసిన ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీని కోసం ముందుగా ఓట్స్ ను గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు చెంచాల ఓట్స్ పౌడర్, కొద్దిగా పాలు, ఒక చెంచా తేనె కలపాలి. వీటిని మిక్స్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీన్ని తరుచుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×