This week Bigg boss 8 eliminate contestant voting percentage: బిగ్ బాస్ 8 ఎంటర్టైన్ మెంట్ రియాలిటీ షో రెండో వారం కూడా ఆసక్తికరంగా సాగుతోంది. గొడవలతో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి ఎపిసోడ్ నుంచి కంటెస్టంట్ల మధ్య వార్ బాగానే రాజుకుంది. అయితే ఈ వారం రెండు రోజులు నామినేషన్ల జాతర జరిగింది. అయితే తొలి రోజు నామినేషన్ల ప్రక్రియలో వాడివేడిగా తారాస్థాయిలో గొడవలు జరిగాయి. రెండో రోజు మాత్రం చప్పగానే సాగాయి. కంటెస్టెంట్లు ఎవరూ కూడా పెద్దగా రచ్చ చేయలేదు. ఇక రీసెంట్ గా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన రోజు రాత్రి నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. అయితే ఈ వారం వచ్చిన ఓటింగ్ సరళని గమనిస్తే సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ ఆరువేల మూడువందల ముప్పై ఐదు ఓట్లతో మొదటి స్థానంలో దూసుకుపోతున్నారు.
నెంబర్ వన్ గా నిఖిల్
నిఖిల్ కు 22.92 శాతం అందరికన్నా అత్యధికంగా ఓట్లు వచ్చాయి. ఇక హాట్ యాంకర్ గా పాపులర్ అయి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా వచ్చిన విష్ణుప్రియ రెండో స్థానంలో ఉన్నారు. ఆమె ఐదు వేల మూడు వందల ఎనిమిది ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 19.2 శాతం ఓట్లు లభించాయి విష్ణుప్రియకు. ఇక మూడో స్థానంలో మణికంఠ ఉన్నారు. మణికంఠ 12.64 శాతం ఓట్లతో మూడు వేల నాలుగువందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఓవరాల్ గా నిఖిల్కు 26శాతం, విష్ణుప్రియకు 18 శాతం, మణికంఠకు 12 శాతం, పృధ్వీరాజ్ కు 11 శాతం, సీతకు 10 శాతం, నైనికకు 9 శాతం ,ఆదిత్యకు 8 శాతం, శేఖర్ భాషాకు 8 శాతం ఓట్లు వచ్చాయి ఇప్పటిదాకా.
డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్లే
అయితే ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నవారిని గమనించినట్లయితే నిఖిల్, ఆదిత్య, శేఖర్ భాషా, సీత, నైనిక కనిపిస్తున్నారు. నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం ఆదిత్య ఓం గానీ, సీత, శేఖర్ భాష గానీ ఎలిమినేటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. మిగిలిన వారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఈ అర్థరాత్రి వరకు వచ్చే ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో ఖరారు కానుంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ వారం సీత ఎలిమినేట్ అవుతుందంటూ ఊదరగొట్టేస్తున్నారు. అయినా ఓటింగ్ వేసేది పబ్లిక్ కాబట్టి చివరి మూమెంట్ లో ఏదైనా జరగొచ్చు.
అలరించిన నేటి ప్రోమో
ఇక నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో నిఖిల్ ప్రస్టేట్ అవుతూ కనిపించాడు. స్పిన్ బాటిల్ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్లు రకరకాల గెటప్పులతో ఎంటర్టైన్ చేస్తున్నారు. నటుడు ఆదిత్య ఓం, నిఖిల్ లేడీ గెటప్పులలో కనిపించారు. స్పిన్ బాటిల్ టాస్క్ లో భాగంగా బాటిల్ ఎవరి వైపు చూపిస్తే వాళ్లు తమకు నచ్చినవారికి టాస్క్ ఇవ్వొచ్చు.