E-Paper
Advertisement

మీ హార్మోన్లు మీ చేతుల్లోనే.. ఆహారంతో హార్మోన్ల అసమతుల్యతకు చెక్!

మీ హార్మోన్లు మీ చేతుల్లోనే.. ఆహారంతో హార్మోన్ల అసమతుల్యతకు చెక్!
Advertisement

Best diet for women: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హార్మోన్ల అసమతుల్యత. మొటిమలు, బరువు పెరగడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం లేదా విపరీతమైన జుట్టు రాలడం వంటివన్నీ హార్మోన్ల గందరగోళానికి సంకేతాలే. అయితే.. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. దానికి సరైన ఇంధనాన్ని (ఆహారాన్ని) అందిస్తే.. అది తనంతట తానుగా హార్మోన్లను పునరుద్ధరించుకోగలదు. మనం తీసుకునే ప్రతి ముక్క మన హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆహారమే ఔషధంగా మారి హార్మోన్లను ఎలా బ్యాలెన్స్ చేస్తుందో తెలుసుకుందాం.

హార్మోన్లు అనేవి మన శరీరంలోని ‘రసాయన దూతలు’. ఇవి మన ఆకలిని, నిద్రను, మూడ్‌ను , సంతానోత్పత్తిని నియంత్రిస్తాయి. ఈ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు కేవలం మందులు వాడటం తాత్కాలిక పరిష్కారమే అవుతుంది. శాశ్వత మార్పు కావాలంటే.. మన భోజనపు ప్లేటులో మార్పు రావాలి.

Advertisement

1. హెల్తీ ఫ్యాట్స్ :
చాలా మంది బరువు తగ్గే క్రమంలో నెయ్యి, నూనెలను పూర్తిగా మానేస్తారు. కానీ మన హార్మోన్ల తయారీకి ‘కొలెస్ట్రాల్’, ‘హెల్తీ ఫ్యాట్స్’ చాలా అవసరం. ముఖ్యంగా ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి ఇవి కీలకం.

ఏం తినాలి? కొబ్బరి నూనె, నెయ్యి, అవకాడో, బాదం, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు

Advertisement

2. సీడ్ సైక్లింగ్:
హార్మోన్ల బ్యాలెన్స్‌కు ఇది ఒక సహజమైన పద్ధతి. నెలసరి చక్రంలోని మొదటి 14 రోజులు అవిసె గింజలు, గుమ్మడి గింజలు తీసుకోవాలి. అండం విడుదలైన తర్వాత నువ్వులు, సన్‌ఫ్లవర్ గింజలు తీసుకోవాలి. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి.

3. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ :
శరీరంలోని అదనపు హార్మోన్లను, ముఖ్యంగా వ్యర్థ ఈస్ట్రోజెన్‌ను బయటకు పంపడానికి కాలేయం రిగ్గా పని చేయాలి. ఆకుకూరలు , బ్రోకలీ వంటి కూరగాయలు కాలేయానికి అవసరమైన విటమిన్లు అందించి.. హార్మోన్ల ‘డిటాక్స్’ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

4. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం:
మనం చక్కెర, మైదా ఎక్కువగా తిన్నప్పుడు శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుంది. ఇది ఆండ్రోజెన్ (పురుష హార్మోన్) పెరగడానికి కారణమై PCOS సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి తీపి పదార్థాలకు బదులు మిల్లెట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

5. పేగు ఆరోగ్యం:
మన శరీరంలోని 70% కంటే ఎక్కువ హార్మోన్ల జీవక్రియ పేగుల్లోనే.. జరుగుతుంది. పేగులు ఆరోగ్యంగా లేకపోతే.. హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తాయి. పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి హార్మోన్లు బ్యాలెన్స్‌ అవుతాయి.

హార్మోన్ల అసమతుల్యత అనేది ఒక రాత్రిలో వచ్చేది కాదు.. అలాగే ఒక రోజులో పోయేది కాదు. స్థిరమైన ఆహారపు అలవాట్లు, రోజుకు కనీసం 7 గంటల నిద్ర, ఒత్తిడి లేని జీవనం అలవరుచుకున్నప్పుడు మాత్రమే ఆహారం తన ప్రభావాన్ని చూపిస్తుంది. గుర్తుంచుకోండి.. మీ వంటిల్లే మీ అతిపెద్ద క్లినిక్. మీరు తినే ఆహారమే మీ రేపటి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×