E-Paper
Advertisement

Weightloss Roti: బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని రోటీలు తినాలి? ఏ పిండితో చేసిన రోటీ తింటే మంచిది?

Weightloss Roti: బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని రోటీలు తినాలి? ఏ పిండితో చేసిన రోటీ తింటే మంచిది?
Advertisement

బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. కానీ రోజు తినే ఆహారంలో ఏమి తినాలి, ఎంత తినాలి అనే విషయంలో మాత్రం అవగాహన ఉండదు. ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా తినే ఆహారం రోటీ లేదా చపాతీ. అయితే రోజుకు ఎన్ని రోటీలు తింటే బరువు తగ్గుతారు? ఏ పిండితో చేసిన చపాతీ మంచిది? అనే విషయాలపై పోషకాహార నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

ఎన్ని రోటీలు తినాలి?
నిపుణులు చెబుతున్న ప్రకారం బరువు తగ్గాలంటే పూర్తిగా తినడం మానేయడం కాదు.. సరైన పరిమాణంలో తినాలి. సాధారణంగా ఒక మనిషికి రోజుకు 2 నుంచి 3 చపాతీలు సరిపోతాయి. అయితే ఇది వ్యక్తి వయస్సు, శరీర బరువు, శారీరక శ్రమ, జీవనశైలి వంటి అంశాలపై కూడ ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఎక్కువగా శారీరకంగా పని చేసే వారు కొంచెం ఎక్కువ తినవచ్చు. కానీ ఎక్కువసేపు కూర్చునే పనులు చేసే వారు తక్కువ పరిమాణంలో తినడం మంచిదని చెబుతున్నారు.

Advertisement

అలాగే రోటీ తినే విధానమూ ముఖ్యం. కేవలం చపాతీ తింటే సరిపోదు. దానితో పాటు కూరగాయలు, పప్పులు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా సమతుల్య ఆహారం తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి, అలాగే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. భోజనంలో సలాడ్లు, పచ్చి కూరగాయలు, పెరుగు వంటి పదార్థాలు చేర్చడం వల్ల త్వరగా తృప్తి కలుగుతుంది. దీంతో ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది.

ఏ పిండి వాడాలి?
ఏ పిండి చపాతీ మంచిది అనే విషయానికి వస్తే సాధారణంగా గోధుమపిండి చపాతీ కంటే మల్టీగ్రెయిన్ పిండి లేదా జొన్న, రాగి, బాజ్రా వంటి మిల్లెట్ పిండితో చేసిన చపాతీలు ఆరోగ్యానికి మంచివని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే కడుపు ఎక్కువసేపు నిండినట్టు అనిపిస్తుంది. దీంతో ఆకలి త్వరగా వేయదు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా స్థిరంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

Advertisement

రోటీలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. చపాతీపై ఎక్కువగా నెయ్యి లేదా వెన్న వేయడం తగ్గించాలి. ఎందుకంటే ఇవి కేలరీలను పెంచుతాయి. అలాగే రాత్రి చాలా ఆలస్యంగా ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. రాత్రి భోజనం తక్కువగా, సులువుగా జీర్ణమయ్యేలా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా రోజూ తగినంత నీరు తాగడం, క్రమంగా నడక లేదా వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడం సులభమవుతుంది.

రోటీలు, చపాతీలు మాత్రమే బరువు తగ్గించదు. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, సరిపడ నిద్ర ఇవన్నీ కలిసి పనిచేస్తేనే మంచి ఫలితం కనిపిస్తుంది. చాలామంది ఒక్కసారిగా తినే పరిమాణాన్ని చాలా తగ్గిస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దానికి బదులుగా మెల్లగా పరిమాణం తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకోవడం మంచిది.

బరువు తగ్గాలని అనుకునే వారు రోజుకు 2 నుంచి 3 చపాతీలు తీసుకోవడం.. వాటితో పాటు కూరగాయలు, ప్రోటీన్ ఆహారం చేర్చడం, మిల్లెట్ లేదా మల్టీగ్రెయిన్ పిండి వాడడం, నిత్య వ్యాయామం చేయడం వంటి అలవాట్లు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే ప్రతి వ్యక్తి శరీర పరిస్థితి వేరు కాబట్టి అవసరమైతే పోషకాహార నిపుణులను సంప్రదించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×