E-Paper
Advertisement

Bengaluru Road Accident: బెంగళూరులో ఘోర ప్రమాదం: స్కూల్ బస్సు కింద పడి ఇద్దరు చిన్నారుల మృతి!

Bengaluru Road Accident: బెంగళూరులో ఘోర ప్రమాదం: స్కూల్ బస్సు కింద పడి ఇద్దరు చిన్నారుల మృతి!
Advertisement

Bengaluru Road Accident: బెంగళూరులో బుధవారం ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో స్కూల్ బస్సు కింద పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఉత్తర బెంగళూరులోని హెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని థానిసంద్ర సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగనగౌడ తన రెండేళ్ల కుమార్తె వర్ష, నాలుగేళ్ల మేనకోడలు భానుతో కలిసి స్కూటర్‌పై పాలు కొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

నాగనగౌడ తన చిన్నారులతో కలిసి ప్రయాణిస్తుండగా, విద్యార్థుల పికప్ కోసం వస్తున్న ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు మలుపు తిరుగుతూ వీరి స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి స్కూటర్ పై ఉన్న చిన్నారులిద్దరూ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. దురదృష్టవశాత్తు, అదే సమయంలో వస్తున్న బస్సు వెనుక చక్రం ఆ పిల్లల పైనుంచి వెళ్లడంతో, వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో నాగనగౌడ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Advertisement

ఘటనపై సమాచారం అందుకున్న హెన్నూరు ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ జరుపుతున్నారు. కళ్ల ముందే ఇద్దరు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×