E-Paper
Advertisement

జీన్స్ ఉతకడం విషయంలో.. చాలా మంది చేసే తప్పులు ఇవే !

జీన్స్ ఉతకడం విషయంలో.. చాలా మంది చేసే తప్పులు ఇవే !
Advertisement

Laundry Tips For Jeans: చాలామంది జీన్స్‌ను ఇతర బట్టల మాదిరిగానే ప్రతిరోజూ ఉతికేస్తుంటారు. కానీ.. ఇలా చేయడం వల్ల మీ ఖరీదైన జీన్స్ రంగు వెలిసిపోవడమే కాకుండా.. ఫిట్టింగ్ కూడా మారిపోతుంది. అసలు తరచుగా వాడే జీన్స్‌ను ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీన్స్‌ను ఎక్కువగా ఉతకడం కంటే.. వాటిని సరిగ్గా మెయింటైన్ చేయడం ముఖ్యం. మీ డెనిమ్ బట్టల ఆయుష్షును పెంచేందుకు, వాటిని ఎప్పుడు, ఎలా ఉతకాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జీన్స్ ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి అనే విషయంపై చాలా మందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు రోజుకు ఒకసారి ఉతకడం అలవాటు చేసుకుంటే.. మరికొందరు నెలల తరబడి ఉతకరు. అసలు వాస్తవం ఏంటంటే.. జీన్స్‌ను త్వరగా ఉతకడం వల్ల వాటిలోని డెనిమ్ ఫైబర్స్ దెబ్బతింటాయి.

Advertisement

జీన్స్‌ను ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి?
సాధారణంగా చెప్పాలంటే.. మీరు మీ జీన్స్‌ను ప్రతిరోజూ వేసుకుంటే, కనీసం 10 నుంచి 15 సార్లు వేసుకున్న తర్వాత మాత్రమే ఉతకాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఆఫీసులో కూర్చుని పనిచేసేవారైతే.. ఈ గ్యాప్ మరికొన్ని రోజులు పెంచినా ఇబ్బందేమీ లేదు.

ఎందుకు తరచుగా ఉతకకూడదు?
రంగు : మీరు జీన్స్‌ను ఎన్నిసార్లు ఎక్కువగా ఉతికితే.. డెనిమ్‌పై ఉన్న రంగు అంత త్వరగా వెలిసిపోతుంది.

Advertisement

ఫిట్టింగ్ దెబ్బతినడం: డిటర్జెంట్లలో ఉండే రసాయనాలు, వాషింగ్ మెషీన్ వేడి నీరు జీన్స్ సాగే స్వభావాన్ని దెబ్బతీస్తాయి.

పర్యావరణం: ప్రతిసారీ ఉతకడం వల్ల నీటి వృధా అవుతుంది. ఇది పర్యావరణానికి కూడా మంచిది కాదు.

జీన్స్‌ను తాజాగా ఉంచే 5 సింపుల్ చిట్కాలు:
స్పాట్ క్లీనింగ్: జీన్స్‌పై ఎక్కడైనా మరకలు పడితే.. మొత్తం ఉతకకుండా ఆ ఒక్క భాగాన్ని మాత్రమే తడి క్లాత్ లేదా బ్రష్‌తో శుభ్రం చేయండి.

ఫ్రీజర్ ట్రిక్: జీన్స్‌లో బ్యాక్టీరియా వల్ల వాసన వస్తుందని అనిపిస్తే.. వాటిని ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి రాత్రంతా ఫ్రీజర్‌లో ఉంచండి. ఇది బ్యాక్టీరియాను చంపి, వాసనను తగ్గిస్తుంది.

గాలి తగిలేలా చూడటం: జీన్స్ వేసుకున్న తర్వాత వాటిని నేరుగా కబోర్డ్‌లో పెట్టకుండా.. బయట గాలి తగిలే చోట కొద్దిసేపు ఆరబెట్టండి. దీనివల్ల చెమట వాసన ఉండదు.

రివర్స్ చేసి ఉతకడం: ఒకవేళ ఉతకాల్సి వస్తే.. జీన్స్‌ను లోపలి వైపునకు తిప్పి ఉతకండి. దీని వల్ల బయట రంగు వెలిసిపోకుండా ఉంటుంది.

చల్లని నీటి వాడకం: ఎప్పుడూ వేడి నీటిని వాడకండి. చల్లని నీరు, తక్కువ డిటర్జెంట్ వాడటం వల్ల డెనిమ్ నాణ్య క్వాలిటీ దెబ్బతినదు.

Also Read: డబుల్ చిన్‌తో ఇబ్బంది పడుతున్నారా? 7 రోజుల్లో ఇలా చెక్ పెట్టండి!

మెషీన్ వాష్ చేస్తున్నారా?
మెషీన్‌లో వేసేటప్పుడు ఎప్పుడూ జీన్స్‌ను విడిగా ఉతకడానికి ప్రయత్నించండి. జిప్స్, బటన్స్ క్లోజ్ చేసి ఉంచడం వల్ల ఇతర బట్టలకు ఎలాంటి సమస్య ఉండదు. అలాగే.. ఎండలో నేరుగా వేయకుండా నీడలో ఆరబెట్టడం బెస్ట్.

మీ జీన్స్‌ను ఎన్నిసార్లు ఉతకాలనేది మీ లైఫ్ స్టైల్ పై ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువగా చెమట పట్టే పనులు చేసేవారైతే త్వరగా ఉతకాలి. లేదంటే పైన చెప్పిన చిట్కాలు పాటిస్తూ చాలా రోజులు ఉతకకుండానే జీన్స్‌ను తాజాగా ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి.. మీరు మీ జీన్స్‌ను ఎంత తక్కువగా ఉతికితే, అవి అంత కాలం మీతో పాటు ఉంటాయి.

Related News

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

Big Stories

Advertisement
×