Pure Ghee: కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టుగా ఉప్పు నుండి పప్పు వరకు , పాల నుండి కోళ్ళ వరకు అన్నీ కల్తీ మాయం అయిపోయాయ్.ఈ క్రమంలో ఎంతో ఇష్టంగా వేసుకునే నెయ్యి కూడా ఇపుడు కల్తీ పాలు కావడంతో భోజన ప్రియులకి ముద్ద దిగని పరిస్థితి, ముఖ్యంగా కొంతమంది కేటుగాళ్ళు అందులో వనస్పతి, జంతువుల కొవ్వు, చౌక రకపు ఆయిల్స్ కలిపేసి మార్కెట్లోకి విచ్చల విడిగా వదలడం మనం చూస్తున్నాం కూడా. మరి మనం వాడే నెయ్యికూడా ఇలా కల్తీ అయిందో లేక స్వచ్చమైనదో తెలుసుకోవాలంటే ఇదిగో ఇలాంటి చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.
పసుపు రంగులో ఉండి, కాస్త పూసలు పూసలుగా ఉంటే
అన్నిటికన్నా ముఖ్యంగా నెయ్యి కొనేటప్పుడు అది పసుపు రంగులో ఉండి, కాస్త పూసలు పూసలుగా ఉంటేనే అది మంచి నెయ్యి అని అర్థం. వెలుతురులో చూసినప్పుడు కూడా అది క్లియర్‌గా ఉండాలి. అలా కాకుండా మరీ తెల్లగా ఉంటె మాత్రం అందులో ఏదో కలిపారని అనుమానించాల్సిందే. ముఖ్యంగా దాని వాసన. మూత తీయగానే కమ్మని వాసన రావాలి కాని ,ఏదో మాడిపోయినట్టుగా లేదా అసహ్యకరమైన స్మెల్ వస్తే మాత్రం అది కచ్చితంగా కల్తీ అయినట్టే.
ప్యూర్ నెయ్యి అయితేనే మన ఒంట్లో ఉండే వేడికి ఈజీగా
ఇక మరో టెస్ట్ ఏంటంటే కొంచెం గడ్డకట్టిన నెయ్యిని మీ అరచేతిలో వేసుకోవాలి.అది ప్యూర్ నెయ్యి అయితేనే మన ఒంట్లో ఉండే వేడికి ఈజీగా కరిగిపోతుంది. అలా కరగకుండా అలాగే గడ్డలా ఉంటే మాత్రం అది కల్తీ అని ఫిక్స్ చేసుకోండి .
గ్లాసు పైన తేలితే మంచి నెయ్యి
మరో రకంగా టెస్ట్ చేయాలంటే ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ నెయ్యి వేయండి,అది గ్లాసు పైన తేలితే మంచి నెయ్యి. అలా కాకుండా గ్లాసు అడుగుకు వెళ్ళిపోయిందంటే మాత్రం అందులో బరువు పెంచే పదార్థాలు కలిపారని అర్థం చేసుకోవాలి.
ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిందంటే
ఇకపోతే ఒక చిన్న గ్లాసులో కొంచెం కరిగించిన నెయ్యి తీసుకొండి.దానిలో అర టీస్పూన్ షుగర్,కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ (ఇది కెమిస్ట్ షాపుల్లో దొరుకుతుంది) వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపండి. అలా రెండు నిమిషాలు అయిన తర్వాత ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిందంటే అందులో వనస్పతి కలిపినట్టేనని కన్ఫాం చేసుకోండి.ఒకవేళ రంగు మారకపోతే అది సేఫ్ అని తెలుసుకోండి.
ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు
ముఖ్యంగా నమ్మకస్తుల దగ్గరే నెయ్యి కొనండి లేదంటే ఇంట్లోనే వెన్న కాచుకుని నెయ్యి తయారు చేసుకోండి.అంతే తప్ప నెయ్యి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దంటున్నారు ఎక్స్పర్ట్స్.ఎందుకంటే ఆదమరిచి కల్తీ నెయ్యి తీసుకున్నమా.. ఆరోగ్యం పాడవ్వడమే కాదు, గుండె సంబంధిత సమస్యలని కూడా వెల్ కం చేసినట్టే.సో ..కేర్ ఫుల్ గా ఉంటారు కదూ !