E-Paper
Advertisement

అమ్మ నమ్మకం వర్సెస్ నాస్తికుడి ప్రేమ! అంత్యక్రియల రచ్చపై ప్రకాష్ రాజ్ ‘విశ్వరూపం’.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

అమ్మ నమ్మకం వర్సెస్ నాస్తికుడి ప్రేమ! అంత్యక్రియల రచ్చపై ప్రకాష్ రాజ్ ‘విశ్వరూపం’.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్!
Advertisement

Prakash Raj:ప్రకాష్ రాజ్ ..సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో చాలెంజింగ్ రోల్స్ వేసిన ఈ వెర్సటైల్ యాక్టర్ తాజాగా తన తల్లిని కోల్పోయిన సంగతి తెల్సిందే.అయితే తల్లిని కోల్పోయిన ప్రకాష్ రాజ్ ని ఓదార్చాల్సింది పోయి, సోషల్ మీడియాలో ఎటాక్ చేసే పనిలో పడ్డారు కొంతమంది నెటిజన్లు .దీనికి కారణం ఏంటో తెలుసా..తన తల్లి సువర్ణలత అంత్యక్రియలను క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించడమే.అవును..అసలు దేవుడినే నమ్మను ,నేను నాస్తికుడిని అంటూ గొప్పగా ప్రకటించుకునే నువ్వు ఇపుడు నీ తల్లి భౌతికకాయాన్ని ఇలా చర్చిలో ఉంచి ప్రార్థనలు, కీర్తనలు చేయించడం ఎందుకో అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అసలు ఒక నాస్తికుడికి ఇలాంటి మతపరమైన ఆచారాలతో పనేంటి? ఇది డబుల్ స్టాండర్డ్ కాదా? అంటూ ప్రశ్నలు సందించే పనిలో పడ్డారు

మా అమ్మకు నేను ఇచ్చే కనీస గౌరవం

Advertisement

అయితే జరుగుతున్న ఈ ట్రోలింగ్‌పై ప్రకాష్ రాజ్ కూడా ఎక్కడా తగ్గకుండా ట్విట్టర్ (X) వేదికగా గట్టిగానే ఇలా కౌంటర్ ఇచ్చారు.”అవును, నేను దేవుడిని నమ్మను.. కానీ మా అమ్మ నమ్మేది! తన విశ్వాసాల ప్రకారం అంతిమ సంస్కారాలు పొందే హక్కును కాదనడానికి నేనెవర్ని? ఇది మా అమ్మకు నేను ఇచ్చే కనీస గౌరవం. ఒంటి నిండా ద్వేషాన్ని నింపుకున్న రాక్షసులకు ఈ ప్రేమానురాగాలు ఏం అర్థమవుతాయి?” అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు .ల్లికి ఇష్టమైన రీతిలోనే ఆమెకు వీడ్కోలు పలకడం ఒక కొడుకుగా తన బాధ్యత అని తేల్చి చెప్పేశాడు ఈ వెర్సటైల్ యాక్టర్.

రెండుగా డివైడ్ అయిపోయిన  నెటిజన్లు

Advertisement

అయితే ప్రకాష్ రాజ్ ఇలా ఆన్సర్ ఇచ్చాడో లేదో రెండుగా డివైడ్ అయిపోయారు నెటిజన్లు.కొంతమంది”తల్లి నమ్మకాన్ని గౌరవించి, ఆమెకు నచ్చినట్లుగా అంతిమ యాత్ర చేసిన ప్రకాష్ రాజ్ నిజమైన కొడుకు. నాస్తికుడైనా మానవత్వం ఉన్న మనిషి” అని కొందరు సపోర్ట్ చేస్తుంటే “మీ తల్లి నమ్మకాన్ని మీరు గౌరవించడం బాగుంది.. మరి ఇతరుల నమ్మకాలను ఎందుకు హేళన చేస్తారు? మీ విమర్శల్లో ఎందుకు అంత ద్వేషం ఉంటుంది?” అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు.

 ‘నాస్తికుడిగా’ ప్రకటించుకున్న ప్రకాష్ రాజ్

ఇక ప్రకాష్ రాజ్ బ్యాక్  గ్రౌండ్ చూస్తె ఆయన తల్లి సువర్ణలత క్రైస్తవురాలు కాగా, తండ్రి మంజునాథ్ రాయ్ హిందువు. ఇలా రెండు రకాల మతాల మధ్యన పెరిగినా, ఆయన ఏ మతం వైపూ మొగ్గు చూపకుండా తనను తాను ‘నాస్తికుడిగా’ ప్రకటించుకున్న సంగతి తెల్సిందే.ఇక గతేడాది కాలంగా రాజకీయంగా, సామాజికంగా ఆయన చేస్తున్న కామెంట్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు.

ఏది ఏమైనా తన తల్లి కడసారి చూపులో ఆమె మనసు కోరుకున్నట్టే చేయడమే గొప్ప సంస్కారం అని ప్రకాష్ రాజ్ ఈ చర్యతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు .. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేక మరిన్ని మలుపులు తీసుకుంటుందా చూడాలి !

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×