E-Paper
Advertisement

రోజూ రుద్దే పని లేకుండా.. బాత్రూమ్ టైల్స్ మెరిసిపోవాలంటే ఇలా ట్రై చేయండి!

రోజూ రుద్దే పని లేకుండా.. బాత్రూమ్ టైల్స్ మెరిసిపోవాలంటే ఇలా ట్రై చేయండి!
Advertisement

Bathroom Cleaning Tips: ఇంట్లో వృద్ధులు, చిన్న పిల్లలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. ముందు మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చాలామంది చెబుతుంటారు. ఈ క్రమంలో ఇంటిని నీట్‌గా ఉంచుతుంటాం. అయితే ఇల్లు ఎంత క్లీన్‌గా ఉన్నా.. బాత్రూమ్ మురికిగా ఉంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. ముఖ్యంగా బాత్రూమ్ టైల్స్‌కు పట్టిన ఆ జిడ్డు, తెల్లటి సబ్బు మరకల్ని వదిలించడానికి గంటల తరబడి వంగి రుద్దడం అంటే ఎవరికైనా విసుగే. అయితే, రోజూ కష్టపడి స్క్రబ్బింగ్ చేయకుండానే.. కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే టైల్స్‌ను ఎప్పుడూ కొత్తవాటిలా మెరిపించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఓసారి చూసేద్దాం రండి..

మసకబారడానికి కారణమిదే:

అసలు టైల్స్ ఎందుకు మసకబారుతాయో తెలిస్తే వాటిని క్లీన్ చేయడం ఈజీ అవుతుంది. మనం వాడే సబ్బులు, షాంపూలలో ఉండే నూనె జిడ్డు టైల్స్‌కు అంటుకుపోతుంది. దీనికి తోడు మనం వాడే నీటిలో లవణాలు (హార్డ్ వాటర్) ఎక్కువగా ఉంటే అవి తెల్లటి గీతల్లా పేరుకుపోతాయి. అలాగే బాత్‌రూమ్‌లో ఎప్పుడూ ఉండే తడి వల్ల నాచు పట్టే అవకాశం కూడా ఉంది.

వైపర్‌ ఉంటే చిటికెలో క్లీన్:

Advertisement

స్నానం పూర్తయ్యాక ఒక్క నిమిషం కేటాయిస్తే మీ పని చాలా వరకు తగ్గుతుంది. బాత్‌రూమ్‌లో ఒక స్క్వీజీ లేదా వైపర్‌ను పెట్టుకోండి. స్నానం ముగిసిన వెంటనే గోడలపై, నేలపై ఉన్న నీటిని వైపర్‌తో లాగేయండి. దీనివల్ల సబ్బు మరకలు ఎండిపోయి గట్టిగా మారవు. ఇలా చేస్తే ప్రతి వారం బ్రష్‌లు పట్టుకుని గట్టిగా రుద్దాల్సిన అవసరమే ఉండదు.

Also Read: బర్నర్ రంధ్రాలు మూసుకుపోయాయా? మెకానిక్ అవసరం లేదు.. ఈ చిన్న ట్రిక్ చాలు!

గాలి తగిలితేనే శుభ్రం:

Advertisement

బాత్‌రూమ్ గది ఎప్పుడూ పొడిగా ఉంటేనే టైల్స్ మెరుస్తాయి. అందుకే స్నానం చేసిన తర్వాత కనీసం ఒక 15 నిమిషాల పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంచాలి. ఫ్యాన్ లేకపోతే కిటికీలు లేదా తలుపులు కాసేపు తీసి ఉంచాలి. గాలి బాగా తగిలితే త్వరగా ఆరిపోవడమే కాకుండా.. చెడు వాసన రాకుండా ఉంటుంది. నాచు పట్టే సమస్య కూడా తప్పుతుంది.

ఘాటైన కెమికల్స్ వద్దు:

చాలామంది టైల్స్ తెల్లగా రావాలని ఘాటైన యాసిడ్లు వాడుతుంటారు. దీనివల్ల టైల్స్‌పై ఉండే పాలిష్ శాశ్వతంగా పోతుంది. దానికి బదులు ఇంట్లో ఉండే నిమ్మరసం లేదా వెనిగర్ వాడితే టైల్స్ సహజంగా మెరుస్తాయి. అలాగే, గరుకుగా ఉండే పీచులకు బదులు మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్ వాడితే టైల్స్‌పై గీతలు పడకుండా నీట్‌గా ఉంటాయి.

వారానికోసారి చిన్న టచ్ అప్:

రోజూ రుద్దే శ్రమ తప్పాలంటే.. వారానికి ఒక్కసారి గోరువెచ్చని నీటితో టైల్స్‌ను కడగాలి. వేడి నీళ్లు జిడ్డును త్వరగా వదిలిస్తాయి. నీటిలో కొద్దిగా మైల్డ్ లిక్విడ్ కలిపి తుడిస్తే చాలు, బాత్‌రూమ్ తళతళలాడుతుంది. పెద్దగా కష్టపడకుండానే బాత్‌రూమ్‌ను ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి ఇవి చక్కటి మార్గాలు.

Also Read: జస్ట్ రూ.250కే ఏసీ లాంటి చల్లదనం.. ఈ పిచ్చి ఎండలకు ఇదే కరెక్ట్ సొల్యూషన్!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×