E-Paper
Advertisement

బర్నర్ రంధ్రాలు మూసుకుపోయాయా? మెకానిక్ అవసరం లేదు.. ఈ చిన్న ట్రిక్ చాలు!

బర్నర్ రంధ్రాలు మూసుకుపోయాయా? మెకానిక్ అవసరం లేదు.. ఈ చిన్న ట్రిక్ చాలు!

Gas Stove Burners: ప్రతి ఇంట్లోనూ పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు గ్యాస్ స్టవ్ వాడుతూనే ఉంటాం. అయితే రోజూ వంట చేయడం వల్ల ఆ నూనె జిడ్డు, మసాలాలు, పాలు లేదా టీ పొంగడం వంటి వాటి వల్ల బర్నర్ రంధ్రాలు మూసుకుపోతుంటాయి. దీనివల్ల గ్యాస్ ఫుల్‌గా ఆన్ చేసినా మంట సరిగ్గా రాదు. కొన్నిసార్లు మంట పసుపు రంగులోకి మారి గిన్నెలు కూడా నల్లగా అయిపోతుంటాయి. ఇలాంటప్పుడు స్టవ్ రిపేర్ వచ్చిందని కంగారు పడి మెకానిక్‌ను పిలవాల్సిన అవసరం లేదు. వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతోనే నిమిషాల్లో బర్నర్లను మెరిపించవచ్చు. అదెలాగంటే..

అసలు కారణం ఇదేనా..

వంట చేసేటప్పుడు పాలు గానీ, కూరలు గానీ పొంగి బర్నర్ మీద పడుతుంటుంది కదా. ఆ మురికి రంధ్రాల్లోకి వెళ్లి గట్టిగా పేరుకుపోతుంది. దీనికి తోడు వంట గదిలో ఉండే జిడ్డు, దుమ్ము కూడా తోడై గాలి వెళ్లే దారిని మూసేస్తాయి. దీనివల్ల మంట సరిగ్గా రాకపోగా గ్యాస్ వృథా అవుతుంది. పైగా వంట అవ్వడానికి కూడా ఎక్కువ టైమ్ పడుతుంది. అందుకే నెలకు ఒకసారైనా వీటిని కాస్త క్లీన్ చేసుకోవడం ఉత్తమం.

Also Read: 50 డిగ్రీలకు పైగా ఎండ.. ఎడారి నగరాల్లో చల్లదనానికి వాడే చిట్కాలివే, మీరూ ఫాలో అయిపోవచ్చు!

జిడ్డును వదిలించాలంటే..

స్టవ్ నుంచి బర్నర్లను విడదీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బాగా వేడిగా ఉన్న నీళ్లను తీసుకుని, అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. ఇప్పుడు ఆ నీళ్లలో బర్నర్లను వేసి ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. నిమ్మకాయలోని పులుపు, వేడి నీళ్లు కలిసి బర్నర్‌కు పట్టిన మొండి జిడ్డును ఇట్టే వదిలిస్తాయి. ఆ తర్వాత తీసి చూస్తే పైన పేరుకుపోయిన మురికి అంతా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది కడిగేస్తే మురికి మొత్తం పోతుంది.

వెనిగర్‌తో మ్యాజిక్..

జిడ్డు మరీ ఎక్కువగా ఉంటే బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్టులా చేసి బర్నర్లకు రాయిలి. ఐదు నిమిషాల తర్వాత పాత టూత్ బ్రష్‌తో మెల్లగా రుద్దితే రంధ్రాల్లోని మురికి వచ్చేస్తుంది. లేదంటే వెనిగర్‌లో బర్నర్లను కాసేపు నానబెట్టినా ఫలితం ఉంటుంది. రంధ్రాల్లో ఏవైనా నలకలు ఉండిపోతే ఒక సన్నని సూది లేదా సేఫ్టీ పిన్నుతో మెల్లగా క్లీన్ చేస్తే గాలి వెళ్లే దారి క్లియర్ అయిపోతుంది.

ఇలా చేయడం మర్చిపోవద్దు..

బర్నర్లను కడిగిన వెంటనే స్టవ్‌పై పెట్టేయకూడదు. అవి లోపల తడిగా ఉంటే గ్యాస్ వెలిగించినప్పుడు మంట సరిగ్గా రాదు. అందుకే ఒక పొడి గుడ్డతో బాగా తుడిచి, కాసేపు ఎండలో గానీ లేదా ఫ్యాన్ కింద గానీ పెట్టి పూర్తిగా ఆరనివ్వాలి. బర్నర్ పొడిగా ఉన్నప్పుడే మంట నీలి రంగులో, స్పీడ్‌గా వస్తుంది. ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవ్వడమే కాకుండా వంట కూడా త్వరగా అవుతుంది.

Also Read: అరెరే.. ఇన్నాళ్లూ ఇది తెలియక ఇబ్బంది పడ్డామే.. బొద్దింకల పనిపట్టే సింపుల్ ట్రిక్ ఇదిగో!

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×