E-Paper
Advertisement

పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? మాటలు రావడం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.. జాగ్రత్త!

పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? మాటలు రావడం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.. జాగ్రత్త!
Advertisement

Child Speech Delay: ప్రస్తుతం పిల్లలు అన్నం తినాలన్నా, ఏడవకుండా ఉండాలన్నా తల్లిదండ్రులు వారి చేతికి స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇది అప్పటికప్పుడు పరిష్కారంగా కనిపించినా.. చిన్నారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రెండు నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో భాషా విజ్ఞానం,మాటలు నేర్చుకునే ప్రక్రియ సహజంగా జరగాలి. కానీ..గంటల కొద్దీ మొబైల్ స్క్రీన్‌కే పరిమితమవ్వడం వల్ల వారిలో మాటలు రావడం ఆలస్యమవడమే కుండా..సామాజిక నైపుణ్యాలు కూడా దెబ్బతింటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొబైల్ స్క్రీన్ టైమ్ – మాటల ఆలస్యం:

1. కమ్యూనికేషన్:
పిల్లలు మాటలు నేర్చుకోవాలంటే.. ఇతరులతో మాట్లాడాలి. వారి హావభావాలను గమనించాలి. కానీ మొబైల్ లేదా టీవీ చూస్తున్నప్పుడు కేవలం వారు వింటారు తప్ప, తిరిగి సమాధానం చెప్పే అవకాశం ఉండదు. ఈ “ఏకపక్ష సంభాషణ” వల్ల పిల్లలు కొత్త పదాలను ఎలా పలకాలో.. భావాలను ఎలా తెలియజేయాలో నేర్చుకోలేకపోతున్నారు.

Advertisement

2. మెదడు ఎదుగుదలపై ప్రభావం:
చిన్నపిల్లల మెదడు చాలా వేగంగా ఎదుగుతుంది. వారు పరిసరాలను గమనించడం, వస్తువులను తాకడం ద్వారా నేర్చుకుంటారు. స్క్రీన్ మీద వేగంగా కదిలే బొమ్మలు వారి మెదడును హైపర్-స్టిమ్యులేట్ చేస్తాయి. దీని వల్ల ఇతరులు మాట్లాడే దానిపై  వారు ఆసక్తి చూపరు. ఫలితంగా మాటలు నేర్చుకోవడం మందగిస్తుంది.

3. సామాజిక పరస్పర చర్య తగ్గడం:
భాష అనేది ఒక సామాజిక నైపుణ్యం.తల్లిదండ్రులు, తోటి పిల్లలతో ఆడుకోవడం ద్వారా పిల్లలు భావ వ్యక్తీకరణ నేర్చుకుంటారు. ఫోన్ చేతిలో ఉంటే.. వారు తమ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోరు. మనుషుల కంటే.. మెషీన్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల వారిలో ‘సోషల్ ఐసోలేషన్’ పెరిగి, మాటల సామర్థ్యం తగ్గిపోతుంది.

Advertisement

నిపుణుల సూచనలు – స్క్రీన్ టైమ్ పరిమితులు:
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం..

18 నెలల లోపు: అస్సలు స్క్రీన్ టైమ్ ఇవ్వకూడదు (వీడియో కాల్స్ మినహా).

2-5 ఏళ్ల మధ్య: రోజుకు గరిష్టంగా 1 గంట మాత్రమే.. అది కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలి.

భోజన సమయం: అన్నం తినేటప్పుడు అస్సలు ఫోన్ చూపించకూడదు.

Also Read: ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే భయపడాల్సిందే!

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పిల్లలతో మాట్లాడండి: మీరు చేసే పనులను వారికి వివరిస్తూ మాట్లాడండి (ఉదాహరణకు: “మనం ఇప్పుడు బాల్ తీసుకుందాం”, “అమ్మ వంట చేస్తోంది”)

కథలు చదవండి: రంగురంగుల ఫోటోలు ఉన్న పుస్తకాలను చూపిస్తూ కథలు చెప్పండి. ఇది వారి పదజాలాన్ని పెంచుతుంది.

బొమ్మలతో ఆటలు: ఫోన్‌కు బదులుగా బిల్డింగ్ బ్లాక్స్, పజిల్స్ లేదా మట్టితో ఆడే బొమ్మలను ఇవ్వండి.

నో-స్క్రీన్ జోన్స్: బెడ్ రూమ్ , డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లను వాడనివ్వకండి. మీరు కూడా వారి ముందు తక్కువగా ఫోన్ వాడటం ద్వారా వారికి ఆదర్శంగా నిలవండి.

పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం అంటే వారి ఎదుగుదలకు మనమే అడ్డుకట్ట వేయడమే. మాటలు ఆలస్యమవ్వడం అనేది కేవలం ప్రారంభం మాత్రమే. ఇది భవిష్యత్తులో వారి చదువుపై, ఆత్మవిశ్వాసంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి.. డిజిటల్ స్క్రీన్ల కంటే మన సమయాన్ని వారికి ఎక్కువగా ఇద్దాం. మీ బిడ్డ ఎదుగుదలలో ఏవైనా అసాధారణ మార్పులు లేదా మాటలు రావడంలో విపరీతమైన ఆలస్యం కనిపిస్తే వెంటనే స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించడం అవసరం.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×