E-Paper
Advertisement

మృణాల్ ‘గ్లామర్’ డోస్.. తెలుగులో సీతమ్మ, హిందీలో మాత్రం రచ్చ రంబోలా!

మృణాల్ ‘గ్లామర్’ డోస్.. తెలుగులో సీతమ్మ, హిందీలో మాత్రం రచ్చ రంబోలా!
Advertisement

Mrunal Thakur: సినిమాల్లో కొన్ని పాత్రలుంటాయి…అవి ఎంతలా ఇంపాక్ట్ చూపిస్తాయంటే, ఆ పాత్రలు వేసిన వాళ్లు మరే పాత్ర వేసినా మనసుకి తీసుకోలేనంత. ఇదిగో ‘సీతారామం’లో మృణాల్ చేసిన సీత పాత్ర కూడా అలాంటిదే.అందం, అభినయం కలగలిపి సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో మెస్మరైజ్ చేసిన ఈ అమ్మడు, ఆ తర్వాత ఏ పాత్ర చేసినా సీత పాత్ర రేంజ్‌లో లేదంటూ నిరాశ పడ్డవారే ఎక్కువ. అయితే ఉన్నంతలో ‘హాయ్ నాన్న’లో తనదైన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చేసి మంచి మార్కులే కొట్టేసింది.ఇక రీసెంట్‌గా వచ్చిన ‘డెకాయిట్’లో సరస్వతిగా పర్వాలేదనే అనిపించింది.

మా సీతమ్మేనా ఇలా చేస్తోంది?

Advertisement

అయితే ఇలా తెలుగులో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన మృణాల్, హిందీలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోవడం గమనార్హం. ముఖ్యంగా వరుణ్ ధావన్‌తో కలిసి ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’లో నటిస్తున్న మృణాల్, తాజాగా వదిలిన  పాటలో అడ్డే లేదన్నట్టుగా అందచందాలను ఒలకబోస్తూ స్టెప్పులేసేసింది.దీంతో ఇది చూసి “మా సీతమ్మేనా ఇలా చేస్తోంది?” అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు తెలుగు ఆడియన్స్.

ALSO READ:తమన్నా కాళ్ళు పట్టుకుంటానంటున్న బాలీవుడ్ స్టార్ ..కామెంట్స్ వైరల్

Advertisement

సౌత్‌లో పద్ధతి.. నార్త్‌లో హద్దులు లేని గ్లామర్!

ఇక ఈ సినిమాలో మృణాల్‌తో పాటు గ్లామర్‌కి కేరాఫ్ అయిన పూజా హెగ్డే కూడా ఉన్నప్పటికీ, తనని మించి మృణాల్ అందాలు ఆరబోయడం కాస్త ఆశ్చర్యమే.ఇక ఇది చూసిన కొందరు సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ఇంతలా దిగజారాలా అని కామెంట్స్ చేస్తుంటే, బాలీవుడ్‌లో నిలబడాలంటే ఈ మాత్రం స్కిన్ షో తప్పదు అంటూ మరికొంత మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంత మంది అడుగు ముందుకేసి తెలుగులో సీతమ్మ.. హిందీలో మాత్రం రచ్చ రంబోలా అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు.

రొటీన్ స్టోరీ.. టీజర్ అట్టర్ ప్లాప్!

ఇక ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమా విషయానికి వస్తే, ఈ మధ్యే వదిలిన టీజర్ కంటెంట్ పరంగా నెగెటివ్ రెస్పాన్స్ నే దక్కించుకుంది. ఎన్నో సినిమాల్లో పీల్చి పిప్పి చేసిన అదే రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అదే ఏడుపు గొట్టు ఫ్యామిలీ డ్రామాలా ఉంది తప్ప మచ్చుక్కైనా కొత్తదనం ఎక్కడా లేదని పెదవి విరుస్తున్నారు మూవీ లవర్స్.చూస్తుంటే టీజర్ సో సో టాక్ తెచ్చుకోవడంతోనే ఇప్పుడు ఇలా ‘వావ్’ అంటూ వీడియో సాంగ్‌ని వదిలినట్టు కనిపిస్తుంది. ఇక సాంగ్‌లో మ్యూజిక్ కంటే మృణాల్, పూజా హెగ్డేల గ్లామర్ షోనే హైలెట్ అయిందన్నది వాస్తవం.

మే 22న రిలీజ్

మరి కంటెంట్ అంతంత మాత్రంగానే కనిపిస్తున్న ఈ సినిమాలో ఏం నచ్చి నటించిందో మృణాల్‌కే తెలియాలి. చూస్తుంటే హిందీలో పాగా వేయాలన్న ఆశ తప్ప స్టోరీలపై ఫోకస్ చేయట్లేదని అర్థమవుతోంది.

ఇక సినిమా విషయానికి వస్తే, డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 22న రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. మరి ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాకి మృణాల్ ‘గ్లామర్’ షో ఏమైనా కలిసొస్తుందో చూడాలి.ఏది ఏమైనా మన సీతారామం సుందరి ఇలా హిందీలో గ్లామర్ షోకి గేట్లు ఎత్తేయడం మన వాళ్లకి డైజెస్ట్ కాదన్నది వాస్తవం.

ALSO READ:ఒకే దెబ్బకు రెండు పిట్టలు: అటు చిరు.. ఇటు బాలయ్య.. డింపుల్ క్రేజ్ మామూలుగా లేదుగా!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×