E-Paper
Advertisement

అమ్మ ప్రేమకు వెల కట్టగలమా? మదర్స్ డే ప్రాముఖ్యతపై మనసుని తాకే మాటలు

అమ్మ ప్రేమకు వెల కట్టగలమా? మదర్స్ డే ప్రాముఖ్యతపై మనసుని తాకే మాటలు
Advertisement

Mothers Day 2026: సృష్టిలో వెల కట్టలేనిది, స్వార్థం తెలియనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం ‘అమ్మ ప్రేమ’ మాత్రమే. తొమ్మిది నెలలు మోసి, పురిటి నొప్పులను భరించి, మనకు ఈ అందమైన లోకాన్ని పరిచయం చేసిన అమ్మకు మనం ఎంత చేసినా తక్కువే. మదర్స్ డే అనేది ఆమె చేసిన త్యాగాలను, పెంచిన పెంపకాన్ని, మన ఎదుగుదల వెనక ఉన్న ఆమె నిరంతర శ్రమను గుర్తు చేసుకునే రోజు. ఈ సందర్భంగా ఆమెకు కేవలం గిఫ్టులు ఇవ్వడమే కాదు, మనసు నిండా ప్రేమతో ఆమెను కౌగిలించుకుని “థాంక్యూ అమ్మ” అని చెప్పండి.

అమ్మ- ప్రేమానురాగాల ప్రతిరూపం:

త్యాగానికి నిలువుటద్దం:
అమ్మ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు.. ఒక గొప్ప శక్తి. మనం పుట్టిన క్షణం నుంచి ఆమె జీవితం మన చుట్టూనే తిరుగుతుంది. తన ఇష్టాలను, తన నిద్రను, తన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి మన ఆకలిని.. మన ఆరోగ్యాన్ని చూసుకునే గొప్ప మనసు ఆమెది. మనకు ఒక చిన్న దెబ్బ తగిలినా కన్నీరు కార్చేది. మనం విజయం సాధిస్తే లోకమంతా గర్వంగా చెప్పుకునేది మొదట అమ్మే.

Advertisement

మొదటి గురువు,మొదటి స్నేహితురాలు:
ఒక బిడ్డకు ప్రపంచాన్ని పరిచయం చేసే మొదటి గురువు అమ్మ. మాటలు నేర్పడం దగ్గరి నుంచి, ఏది మంచి ఏది చెడు అని వివరించే వరకు ఆమె అడుగడుగునా మనకు తోడుగా ఉంటుంది. మనసులో ఉన్న బాధను ఎవరికీ చెప్పుకోలేనప్పుడు.. అమ్మ దగ్గర తలపెట్టి చెబితే వచ్చే ఆ ప్రశాంతత మరెక్కడా దొరకదు. మన కళ్ళల్లో చిన్న నీటి చుక్కను చూసినా, మనం చెప్పకపోయినా మన మనసులోని బాధను కనిపెట్టే ఏకైక వ్యక్తి ఆమె.

మదర్స్ డే ఎందుకు జరుపుకోవాలి?
అమ్మను ప్రేమించడానికి రోజుతో పనిలేదు. కానీ.. నేటి బిజీ లైఫ్‌లో  మనం అమ్మకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. అలాంటి సమయంలోనూ కాస్త బ్రేక్ తీసుకుని, కేవలం అమ్మ కోసమే కేటాయించే రోజుగా మదర్స్ డేను భావించాలి. ఆమె మన జీవితానికి అందించిన వెలుగును స్మరించుకోవడానికి ఈ రోజు ఒక వేదిక.

Advertisement

అమ్మకు మనం ఇచ్చే గొప్ప బహుమతి:
1.మదర్స్ డే రోజు అమ్మకు ఖరీదైన చీరలు లేదా నగలు ఇవ్వడం ముఖ్యం కాదు. ఆమెకు కావాల్సిందల్లా కాస్త సమయం, మనం బాగుండాలనే కోరిక.

2.ఆమె చేసిన వంటను మెచ్చుకుంటూ ఒక పూట హాయిగా మాట్లాడండి.

3.ఆమె పడే కష్టంలో ఒక చేయి వేయండి.

4.”నువ్వు పక్కన ఉంటే నాకు ధైర్యం అమ్మ” అని ఒక్క మాట చెప్పండి.

5. ఆమె కళ్లలో కనిపించే ఆనందం వేల కోట్ల రూపాయల కంటే విలువైనది.

నేటి సమాజంలో అమ్మ:
దురదృష్టవశాత్తు నేటి కాలంలో కొందరు అమ్మను భారం అనుకుంటున్నారు. వృద్ధాశ్రమాలలో అమ్మలను వదిలేస్తున్న ఘటనలు విన్నప్పుడు మనసు ద్రవిస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏటంటే.. మనల్ని నడక నేర్పిన అదే చేతులకు, ఆ వయసులో మన తోడు కావాలి. మదర్స్ డే రోజున అమ్మకు ఇచ్చే అసలైన గౌరవం ఆమెను చివరి వరకు కళ్ళలో పెట్టుకుని చూసుకోవడమే.

దేవుడు ప్రతిచోటా ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. అది అక్షర సత్యం. అమ్మ అనేది ఒక పిలుపు కాదు. అది ఒక అనుభూతి. ఈ మదర్స్ డే రోజున మీ అమ్మను గట్టిగా హత్తుకోండి. ఆమెతో కలిసి సమయం గడపండి. ప్రపంచంలో అందరూ మనల్ని వదిలేసినా.. “నేనున్నాను ” అని ధైర్యం చెప్పే ఆ గొప్ప దేవతకు పాదాభివందనం చేద్దాం. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ మామ్స్!

Tags

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×