E-Paper
Advertisement

Iron Rich Drinks: శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరగాలా.. ఈ డ్రింక్స్ తాగండి..!

Iron Rich Drinks: శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరగాలా.. ఈ డ్రింక్స్ తాగండి..!
Advertisement

Iron Rich Drinks: హిమోగ్లోబిన్ మానవ శరీరానికి అతి ముఖ్యమైన ప్రోటీన్. అధిక హిమోగ్లోబిన్ స్థాయి ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అవసరం. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. ఈ ప్రక్రియనే ఆక్సిహెమోగ్లోబిన్‌ అని అంటారు. శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత లేకపోతే రక్తహీనత ఏర్పతుంది. అందుకే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరగడానికి ఐరన్ ఉన్న డ్రింక్స్ తాగాలి.

బీట్‌ రూట్ జ్యూస్: బీట్‌రూట్‌లో ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, బీటైన్ పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి జరుగుతుంది. దీని వల్ల శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపడుతుంది. 100 గ్రాముల బీట్‌రూట్‌లో దాదాపు 0.8 mg ఐరన్ ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ లెవల్స్ పెరగడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

Advertisement

నువ్వులు, ఖర్జూర స్మూతీస్: నువ్వులు, ఖర్జూరాలతో చేసిన స్మూతీస్ వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది. నువ్వుల్లో  విటమిన్ ఇ, జింక్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. పాలల్లో తేనె కలిపి ఖర్జూరాలు, నువ్వులను నానబెట్టాలి. అవి మెత్త బడిన తర్వాత బ్లెండ్ చేయాలి. దీంతో రుచికరమైన స్మూతీ తయారవుతుంది.

Also Read: టీ ఎక్కడ, ఎప్పుడు మొదలైందో తెలుసా..?

Advertisement

పుదీనా డ్రింక్: పుదీనాలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు పుదీనాకు పుష్కలంగా ఉంటాయి. పుదీనా జ్యూస్ తాగితే శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయి పెరగడానికి ఉపయోగపడుతుంది.100 గ్రాముల పుదీనా ఆకుల్లో సుమారు 16 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఒక కప్పు పుదీనా జ్యూస్ నుంచి 4 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది.

బఠానీ ప్రోటీన్ షేక్‌: బఠానీ ప్రోటీన్ పౌడర్‌లో అధిక శాతంలో ప్రోటీన్ ఉంటుంది. 20 గ్రాముల బఠానీ ప్రోటీన్ తింటే రోజులో అవసరమైన ఐరన్ లో 30 శాతం పొందొచ్చు. బఠానీతో షేక్స్, స్మూతీస్ చేసుకుని కూడా ఆస్వాదించవచ్చు. దీని ద్వారా హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.

Tags

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×