BigTV English

Hero Xtreme 125R: అద్భుతం చేసిన హీరో 125R.. అదిరిపోతున్న రెస్పాన్స్‌..!

Hero Xtreme 125R: అద్భుతం చేసిన హీరో 125R.. అదిరిపోతున్న రెస్పాన్స్‌..!

Hero Xtreme 125R Bike: దేశంలోనే నంబర్ వన్ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. కంపెనీ తన కొత్త 125 సీసీ బైక్‌ ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ జనవరి 2024లో మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్‌‌ను ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. హీరో Xtreme 125R దాని లుక్స్, డిజైన్ కారణంగా 125సీసీ సెగ్మెంట్లో అత్యంత స్టైలిష్ మోటార్‌సైకిల్‌గా మారింది. స్టైల్ మాత్రమే కాదు.. ఈ బైక్ ఆ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఫీచర్లతో కూడా వచ్చింది.


కంపెనీ మొత్తం ఈ బైక్ అమ్మకాలు ఫిబ్రవరిలో 4.68 లక్షల యూనిట్లను దాటాయి. ఫిబ్రవరి 2023లో విక్రయించిన 3.94 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 19 శాతం పెరిగాయి. హీరో కంపెనీ 100సీసీ నుండి 125సీసీ సెగ్మెంట్‌లో అత్యధిక బైక్‌లను మార్కెట్లో విక్రయిస్తుంది. కంపెనీ విక్రయించిన మొత్తం టూ వీలర్ల నుంచి ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ మార్కెట్లో విపరీతమైన రెస్పాన్స్‌ను పొందింది. ఇంతకీ ఈ బైక్‌లోని ప్రత్యేకత ఏమిటో చూడండి.

Also Read: బైక్‌‌పై రూ.లక్షల్లో డిస్కౌంట్.. రేపే లాస్ట్


హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌లో పూర్తిగా కొత్త ఇంజన్‌ను ఇన్‌స్టాల్ చేశారు. ఈ బైక్ కోసం ప్రత్యేకంగా ఈ 125సీసీ ఇంజన్‌ను డెవలప్ చేశారు. కంపెనీకి చెందిన ఇతర 125సీసీ ఇంజన్‌ల కంటే ఇది ఎక్కువ పవర్, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 11.55 BHP పవర్, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ సిటీ రైడ్, హైవే రెండింటిలోనూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

కంపెనీ ఈ బైక్‌కు నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ డిజైన్‌ను అందించింది. బైక్ మొత్తం డిజైన్ చాలా షార్ప్‌గా ఉంటుంది. మీరు ఈ బైక్‌పై కూర్చున్న వెంటనే మీరు 125సీసీ బైక్‌ను నడుపుతున్నట్లు కాకుండా ఏదో పెద్ద సీసీ ఇంజన్ కలిగిన బైక్‌ను నడుపుతున్నట్లు అనిపిస్తుంది. దీని డిజైన్ కారణంగా 125 సీసీ వేరియంట్‌లో  స్టైలిష్ బైక్‌గా మారింది.

Also Read: సరికొత్త వెర్షన్‌లో హోండా యాక్టివా.. లాంచ్ ఎప్పుడంటే?

ఈ బైక్ ఫీచర్లు కాస్త భిన్నంగా ఉంటాయి. ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్, సింగిల్ ఛానల్ ABS వంటి ఫీచర్లతో వచ్చిన ఈ 125 సీసీ బైక్ సెగ్మెంట్‌లో మొదటిది. బైక్‌లో పూర్తి LED లైట్ సెటప్ అందుబాటులో ఉంది. హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు కాకుండా, LED లలో టర్న్ ఇండికేటర్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా హజార్డ్ లైట్ ఫంక్షన్ కూడా ఇందులో ఉంది. బైక్‌లో ఉండే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వల్ల ప్రీమియంగా కనిపిస్తుంది. హీరో Xtreme 125R బేస్ మోడల్ ధర రూ. 99,500 నుండి ప్రారంభమవుతుంది. అయితే ABS తో దాని టాప్ మోడల్ ధర రూ. 99,500, ఎక్స్-షోరూమ్. ఈ బైక్ చాలా డీలర్‌షిప్‌ల వద్ద స్టాక్ లేదు. బుక్ చేసిన 10-15 రోజుల తర్వాత డెలివరీ ఇవ్వబడుతుంది.

Tags

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×