E-Paper
Advertisement

Raw Cabbage: పచ్చి క్యాబేజీ తినడం అంత ప్రమాదకరమా? తింటే ఏమవుతుంది?

Raw Cabbage: పచ్చి క్యాబేజీ తినడం అంత ప్రమాదకరమా? తింటే ఏమవుతుంది?
Advertisement

పచ్చి క్యాబేజీని చైనీస్ ఫుడ్స్ లో, సలాడ్లలో తింటూ ఉంటారు. క్యాబేజీలో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.
ఇందులో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే పచ్చి క్యాబేజీ తినడం వల్ల కొన్ని లాభాలతో పాటు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

క్యాబేజీతో లాభాలు
పచ్చి క్యాబేజీ తినడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వాపులను తగ్గించే లక్షణాలు కూడా క్యాబేజీలో ఉన్నాయి. కొంతమంది పరిశోధనల ప్రకారం క్యాబేజీలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు పచ్చి క్యాబేజీని సలాడ్లలో చేర్చుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువ ఆహారం తినకుండా నియంత్రించుకోవచ్చు. ఈ కారణాల వల్ల పచ్చి క్యాబేజీని ఆరోగ్యకరమైన ఆహారంగా చాలామంది భావిస్తారు.

Advertisement

పచ్చిగా తింటే కలిగే ప్రమాదాలు
అయితే పచ్చి క్యాబేజీ వల్ల వచ్చే ప్రమాదాలు ఎక్కువగానే ఉన్నాయి.క్యాబేజీలో గోయిట్రోజెన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు పచ్చి క్యాబేజీ ఎక్కువగా తీసుకుంటే సమస్య తీవ్రంగా మారుతుంది. అలాగే పచ్చి క్యాబేజీ జీర్ణం కావడం కొంతమందికి కష్టం అవుతుంది. దీని వల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు పచ్చి క్యాబేజీ తిన్న తర్వాత అసౌకర్యాన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పచ్చి క్యాబేజీని సరిగ్గా కడగకుండా తింటే అందులో ఉండే బ్యాక్టీరియా, పురుగుమందుల అవశేషాలు శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాలు క్యాబేజీ ఆకుల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కడుపు ఇన్ఫెక్షన్లు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు కారణం కావచ్చు. అందుకే పచ్చిగా తినాలంటే శుభ్రంగా నీటిలో నానబెట్టి, ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటితో కడిగాలి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పచ్చి క్యాబేజీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

వండుకుని తింటే మంచిది
అయితే క్యాబేజీని వండుకొని తినడం వల్ల ఈ ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయి. వండే సమయంలో గోయిట్రోజెన్స్ ప్రభావం తగ్గుతుంది. జీర్ణక్రియకు కూడా సులభంగా మారుతుంది. అందుకే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు, తరచూ గ్యాస్ సమస్యతో బాధపడేవారు వండిన క్యాబేజీనే తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తంగా పచ్చి క్యాబేజీ పూర్తిగా ప్రమాదకరం అని చెప్పలేము. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని దీన్నితినడం మంచిది.

Related News

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

Big Stories

Advertisement
×