LPG Cylinder Blast Summer| భారత దేశంలో కోట్ల కుటుంబాలు ప్రతిరోజూ వంట చేసేందుకు గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తున్నాయి. అయితే వంట గదిలో గ్యాస్ సిలిండర్లు పేలిపోతున్న ఘటనలు నమోదవుతున్నాయి. వేసవి కాలంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతేనే ఈ ప్రమాదాలు జరుగుతాయి. చిన్న తప్పులు కూడా గ్యాస్ లీకేజీ, అగ్ని ప్రమాదాలకు దారి తీస్తాయి. సరైన అవగాహన, నిర్వహణతో ఈ ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు. గ్యాస్ ఆదా చేయడం కూడా సాధ్యమవుతుంది.
చాలా ప్రమాదాలు గ్యాస్ లీకేజీ, నిర్లక్ష్యం వల్లే జరుగుతాయి. పాత రబ్బర్ ట్యూబులు, లూజ్ రెగ్యులేటర్లు, సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతాయి. స్టవ్ దగ్గర త్వరగా అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు ఉంచడం కూడా ప్రమాదకరం.
గ్యాస్ సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగా ఉంచాలి. అడ్డంగా పడేసి ఉంచడం వల్ల గ్యాస్ ప్రవాహం సరిగా ఉండదు. సమతలమైన, స్థిరమైన ప్రదేశంలో ఉంచండి. చీకటి గదులు లేదా గాలి తిరగని ప్రదేశాల్లో సిలిండర్ ఉంచకండి. మంచి వెంటిలేషన్ ఉంటే లీకేజీ సమయంలో కూడా ప్రమాదం తగ్గుతుంది.
రోజూ గ్యాస్ లీకేజీ కోసం చెక్ చేస్తూ ఉండాలి. గ్యాస్ వాసన వస్తే వెంటనే గమనించాలి. సబ్బు నీటితో పైపు కనెక్షన్ల వద్ద చెక్ చేస్తే బుడగలు కనిపిస్తే లీకేజీ ఉన్నట్టు. సిగరెట్ లైటర్ మంటతో కూడా చెక్ చేయవచ్చు. గ్యాస్ వాసన వచ్చినప్పుడు రెగ్యులేటర్ వెంటనే ఆఫ్ చేసి, తలుపులు, కిటికీలు తెరవండి.
రబ్బర్ ట్యూబులు రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చాలి. పగుళ్లు ఉన్న లేదా గట్టిపడిన ట్యూబులు ప్రమాదకరం. ISI మార్క్ ఉన్న మంచి నాణ్యత గల ట్యూబులు మాత్రమే వాడాలి.
వంట చేస్తున్నప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలి. వంట అయిపోగానే బర్నర్లు ఆఫ్ చేయాలి. స్టవ్ ఆన్‌లో ఉండగా వంటగది నుంచి దూరం వెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.
స్టవ్ బర్నర్లు శుభ్రంగా ఉంటే మంట నీలం రంగులో వస్తుంది. ఇది గ్యాస్ సరిగ్గా మండుతోందని సూచన. స్టవ్ దగ్గర కాగితాలు, ప్లాస్టిక్, నూనె ఉంచకండి.
భయపడకండి. వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. స్టవ్ వెలిగించకండి. ఎలక్ట్రిక్ స్విచ్‌లు అన్ని ఆఫ్‌లో ఉండాలి. ఆన్ చేయకూడదు. కుటుంబ సభ్యులను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లండి. గ్యాస్ ఏజెన్సీకి వెంటనే సమాచారం ఇవ్వండి.
Also Read: ఇంట్లో సుఖ సంతోషాల కోసం తప్పనిసరిగా ఇవి పాటించాలి.. చాణక్యుడు బోధించిన కుటుంబ సూత్రాలు
ప్రెజర్ కుక్కర్ వాడండి. పాత్రలకు మూత పెట్టి వంట చేయండి. బియ్యం, పప్పులు ముందుగా నానబెట్టండి. స్టవ్ మీద తడి పాత్రలు పెట్టకండి. మీడియం ఫ్లేమ్‌తో వంట చేయండి. వంట అయిపోగానే రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేయండి.
గ్యాస్ సిలిండర్లు అధికారిక డీలర్ల నుంచి మాత్రమే కొనాలి. డెలివరీ సమయంలో సీల్ సరిగ్గా ఉందా చూడండి. డ్యామేజ్ సిలిండర్లు అసలు తీసుకోవచ్చు. సిలిండర్ డ్యామేజ్ కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి.