E-Paper
Advertisement

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Golden Face Pack: ప్రతి ఒక్కరూ తమ ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. వాతావరణం మారడం ప్రారంభించినప్పుడల్లా, దాని ప్రభావం మన చర్మంపై ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాంటి సమయంలోనే మీ ముఖం వాడిపోయినట్లు, చర్మం పొడిబారినట్లు అనిపిస్తే మాత్రం మీ చర్మానికి సంరక్షణ అవసరమని గుర్తుంచుకోండి. అలాంటి సమయంలోనే కొన్ని హోం రెమెడీస్ వాడండి. ఇవి ప్రభావవంతగా పని చేస్తాయి. పాలు , పసుపుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి వాడితే మాత్రం ఫేస్ మెరిసిపోతుంది. ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి.

పాలు, పసుపును చర్మానికి అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. తరుచుగా పాలు, పసుపు కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, అంతే కాకుండా ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలలో పసుపు కలిపి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. పసుపులో ఉండే పోషకాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని కాపాడతాయి. చర్మాన్ని మెరుస్తూ ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడానికే కాకుండా చర్మం రంగును కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మొటిమలు, మొటిమలు మాయం: పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. మరో వైపు పాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. చర్మంపై ఉండే ఎరుపు, మంటను తగ్గిస్తాయి.

మచ్చలను తగ్గిస్తుంది: పసుపులో తేలికపాటి బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై మచ్చలు, నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. పాలు చర్మానికి పోషణనిచ్చి హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.

ముడతలను తగ్గిస్తుంది: పసుపులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి. పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా చేస్తాయి.

పొడి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది: పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. అంతే కాకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది. పసుపు చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యవంతంగా చేస్తుంది.

Also Read: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

పాలు, పసుపుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
పచ్చి పాలు- 1 టేబుల్ స్పూన్
పసుపు – 1/4 టీస్పూన్

తయారీ విధానం:
ఒక గిన్నెలో ముందుగా 1 టేబుల్ స్పూన్ పచ్చి పాలు తీసుకోండి. దానిలో 1/4 టీస్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఆ తర్వాత దీనిని మీ ముఖం, మెడపై రాయండి. ఆ తర్వాత 15-20 నిమిషాలు ఆరనివ్వండి. అనంతకం చల్లటి నీటితో కడిగేయండి. ప్రతి వారం 2-3 సార్లు ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖం అందంగా మారుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

Big Stories

×