BigTV English
Advertisement

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Laryngeal Cancer Signs: క్యాన్సర్ అనేది చాలా డేంజరస్ వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. దానికి కారణం రోగం ముదిరిన తర్వాత గుర్తించడం. క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నయం చేసుకునే అవకాశం ఉంది. ఈజీగా గుర్తించే క్యాన్సర్లలో స్వరపేటిక క్యాన్సర్ ఒకటి. ముఖ్యంగా నెల రోజుల పాటు గొంతులో నొప్పి, మాట్లాడుతుంటే బొంగురుపోతే స్వరపేటిక క్యాన్సర్ సోకినట్లు అనుమానించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్షకు పైగా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే, ఈ వ్యాధి విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు.


స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు   

స్వరపేటిక క్యాన్సర్ సోకిన వారిలో విపరీతమైన దగ్గు, గొంతు నొప్పి ఏర్పడుతుంది. మాట్లాడుతుంటే వాయిస్ బొంగురుపోతుంది. ఆహారం తీసుకునేటప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. మెడ భాగంలో ఒక ముద్దలా వాపు కనిపిస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలుగుతుంది. నిరంతరం గొంతునొప్పి లేదంటే చెవినొప్పి ఏర్పడుతుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు గురక ఏర్పడుతుంది. అకస్మాత్తుగా బరువు తగ్గడం, చీటికిమాటికి తీవ్రమైన అలసటకు గురికావడం కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణం. ఈ వ్యాధి 60 ఏళ్లు పైబడిన వారిలో  స్త్రీల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని రకాల క్యాన్సర్ల మాదిరిగానే, దీనిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.  గొంతులో సుమారు నెల రోజుల పాటు ఇబ్బందిగా ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి. క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి.


స్వరపేటిక క్యాన్సర్ చికిత్సలు

స్వరపేటిక క్యాన్సర్ ఉన్నట్లు తేలితే పలు రకాల చికిత్స విధానాలను వైద్యులు పాటిస్తారు. వాటిలో ప్రధానంగా మూడు చికిత్సలు ఉంటాయి. 1. రేడియోథెరఫీ 2. శస్త్ర చికిత్స 3. కీమోథెరపీ. క్యాన్సర్ ను త్వరగా గుర్తిస్తే రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను తొలగించే అవకాశం ఉంటుంది.  క్యాన్సర్ తీవ్రత పెరిగితే స్వరపేటికలోని కొంత భాగాన్ని తొలగించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స, రేడియోథెరఫీ, కీమోథెరఫీనలో ఏదో ఒకదాన్ని  ఉపయోగించి పూర్తిగా తొలగించాల్సి రావచ్చు. ఒకవేళ స్వరపేటికలోని కొంత భాగాన్ని తొలగించినట్లైతే గతంలో మాదిరిగా మాట్లాడే అవకాశం ఉండదు. ఊపిరి పీల్చుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి.

స్వరపేటిక క్యాన్సర్ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్వరపేటిక క్యాన్సర్ సోకితే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఒకవేళ ధూమపానం కొనసాగిస్తే నోరు, ముక్కు, గొంతు, లంగ్స్ క్యాన్సర్ కు కారణం అవుతుంది. మద్యం ఒంట్లో నీటిశాతాన్ని తగ్గించిం మరింత బరువు తగ్గేలా చేస్తుంది. గొంత నొప్పి నుంచి ఉపశమనం కలుగాలంటే వీలైనంత వరకు గట్టిగా మాట్లాడకూడదు. అవసరం అయితేనే నోరు విప్పడం మంచిది. అలాగే మాట్లాడితే గొంతులో ఇన్ఫెక్షన్ పెరిగి వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read: 2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Heart Health:గుండె జబ్బులు ఉన్నాయని తెలిపే.. సంకేతాలు ఇవేనట !

Fruits For Weight loss: బరువు తగ్గాలనుకునే వారు.. ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ?

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Dark Tourism: చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. నాణేనికి మరో వైపే డార్క్ టూరిజం!

Zumba Dance: బోరింగ్ వర్కౌట్స్‌తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!

Karivepaku Rice: కరివేపాకు రైస్ పావు గంటలో చేసేయొచ్చు, రెసిపీ చాలా సులువు

Trial Separation: విడాకులు తీసుకునే ముందు.. ఒక్కసారి ‘ట్రయల్ సెపరేషన్’ ప్రయత్నించండి!

Wasting Money: విలాసవంతమైన కోరికలకు కళ్లెం వేయకుంటే.. మిమ్మల్ని చుట్టుముట్టే సమస్యలివే!

Big Stories

×