E-Paper
Advertisement

నీళ్లు లేకుండానే స్నానం చేస్తున్న ఆ దేశ ప్రజలు.. క్లీన్‌గా ఎలా ఉంటున్నారో తెలుసా?

నీళ్లు లేకుండానే స్నానం చేస్తున్న ఆ దేశ ప్రజలు.. క్లీన్‌గా ఎలా ఉంటున్నారో తెలుసా?
Advertisement

ఆఫ్రికా ఖండం నమీబియా దేశం ఉత్తర భాగంలో హింబా తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరు తమ ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయ జీవన విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. వీరి అత్యంత అసాధారణమైన అలవాటు ఏమిటంటే.. నీళ్ల లేకుండా స్నానం చేయడం. అయినప్పటికీ హింబా ప్రజలు చాలా శుభ్రంగా, సహజంగా శరీర శుచిత్వాన్ని కాపాడుకుంటారు.

కఠినమైన ఎడారి ప్రాంతంలో జీవించే హింబా తెగ

హింబా ప్రజలు నమీబియా ఎడారి ప్రాంతాల్లో జీవితం సాగిస్తారు. ఇక్కడ నీరు చాలా తక్కువగా ఉంటుంది. తాగడానికి, ఇంటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగిస్తారు. కాబట్టి నీళ్లతో స్నానం చేయడం వారికి సాధ్యం కాదు. ఈ కఠినమైన వాతావరణానికి అనుగుణంగా వారి సంప్రదాయాలు ఏర్పడ్డాయి.

నీళ్లకు బదులుగా పొగ స్నానం

Advertisement

హింబా మహిళలు పొగ స్నానం (స్మోక్ బాత్) చేస్తారు. చిన్న గిన్నెలో వేడి బొగ్గు, మూలికలు వేసి.. ఆ పొగ శరీరానికి పట్టిస్తారు. ఈ పొగ చర్మంలోని రంధ్రాలను తెరిచి చెమట ద్వారా శరీరాన్ని శుభ్రం చేస్తుంది. కొందరు దీన్ని బ్లాంకెట్‌తో కప్పుకుని చేస్తారు. ఇది నీళ్లు లేకుండా శరీరాన్ని శుభ్రపరుస్తుంది.

ఎర్రటి ఒక్రె పేస్ట్ చర్మాన్ని రక్షిస్తుంది

హింబా మహిళలు రోజూ ‘ఒక్రె’ అనే పేస్ట్‌ను శరీరం, జుట్టుపై పూస్తారు. ఇందులో వెన్న, ఎర్రటి ఒక్రే మట్టి, మూలికలు ఉంటాయి. ఇది వారి శరీరానికి అందమైన ఎరుపు రంగును ఇస్తుంది. ఎండ, వేడి, పొడి వాతావరణం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. శరీర వాసన, కీటకాల కాటువేయడం కూడా తగ్గిస్తుంది. ఇది వారి అలంకరణ సంప్రదాయంలో ముఖ్య భాగం.

హింబా తెగకు శుచిత్వం చాలా ముఖ్యం

Advertisement

చాలా మంది హింబా తెగ వాసులు.. నీళ్లు వినియోగించరు కాబట్టి శుభ్రంగా ఉండరని అందరిలో తప్పుడు భావన. కానీ వారు తమ వాతావరణానికి అనుగుణంగా వేరే పద్ధతుల్లో శుభ్రతను కాపాడుకుంటారు. పొగ స్నానం, మూలికలు, ఒక్రె పేస్ట్ ద్వారా శరీరాన్ని తాజాగా ఉంచుతారు.

హింబా సంస్కృతి ఇప్పటికీ బలంగా ఉంది

హింబా తెగ ప్రాచీన సంప్రదాయాలను ఇప్పటికీ కాపాడుతోంది. పశువులు, మేకలతో వారు తమ నివాస ప్రాంతాలను బంజారా విధానం తిరుగుతూ గుడపుతుంటారు. సాంప్రదాయ ఆభరణాలు, హెయిర్ స్టైల్స్ వారి సంస్కృతి గుర్తులు. కుటుంబం, పూర్వీకులు, సమాజం పట్ల వారికి గొప్ప గౌరవం ఉంది.

Also Read: ఎండాకాలంలో చల్లని బీర్ తాగడం ఆరోగ్యానికి హానికరం? నిజమేనా సురక్షితమా? సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి

హింబా జాతి సంస్కృతి తెలుసుకోవడానికి వచ్చే పర్యాటకులు

ప్రపంచం నుంచి చాలా మంది పర్యాటకులు హింబా సంస్కృతిని చూడడానికి వస్తారు. వారి ప్రత్యేక శుచిత్వ పద్ధతులు, సహజ అందం చూసి ఆశ్చర్యపోతారు. అయితే వారి సంస్కృతిని గౌరవంగా చూడాలని నిపుణులు సూచిస్తారు.

హింబా తెగ కఠినమైన ఎడారి వాతావరణానికి అనుగుణంగా తమ సంప్రదాయాలను మలచుకుంది. నీరు లేకపోయినా పొగ స్నానం, ఒక్రె పేస్ట్ ద్వారా శుభ్రతను కాపాడుకుంటారు. వారి జీవన విధానం అనుసరణ, బలమైన సంస్కృతికి ఉదాహరణ. హింబా తెగ నమీబియా అత్యంత ఆకర్షణీయమైన తెగలలో ఒకటి.

Related News

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

Big Stories

Advertisement
×