E-Paper
Advertisement

కెమికల్స్ లేని మేకప్ రిమూవల్.. వంటింట్లో దొరికే ఈ 3 పదార్థాలతో మెరిసే చర్మం

కెమికల్స్ లేని మేకప్ రిమూవల్.. వంటింట్లో దొరికే ఈ 3 పదార్థాలతో మెరిసే చర్మం
Advertisement

Natural Makeup Remover At Home:  ఫంక్షన్లకు లేదా పార్టీలకు వెళ్ళినప్పుడు మేకప్ వేసుకోవడం ఎంత సరదాగా ఉంటుందో, తిరిగి వచ్చాక దానిని తీసేయడం అంతకంటే పెద్ద టాస్క్. చాలా మంది మార్కెట్లో దొరికే ఖరీదైన మేకప్ రిమూవర్లను వాడుతుంటారు. కానీ వాటిలో ఉండే ఆల్కహాల్, కెమికల్స్ వల్ల చర్మం పొడిబారిపోవడం, మొటిమలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నిజానికి.. మీ మేకప్‌ను ఎంతో సులభంగా.. చర్మానికి హాని కలగకుండా తొలగించే అద్భుతమైన పదార్థాలు మీ వంటింట్లోనే.. ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఇకపై బయట మేకప్ రిమూవర్లు కొనడం మానేస్తారు.

మేకప్ తీసేయడానికి కెమికల్స్ ఎందుకు? 

Advertisement

రోజంతా మేకప్‌తో ఉన్నప్పుడు చర్మంపై రంధ్రాలు మూసుకుపోతాయి. అందుకే రాత్రి పడుకునే ముందు మేకప్‌ను పూర్తిగా తొలగించడం చాలా ముఖ్యం. రసాయనాలు లేని పద్ధతిలో.. మేకప్ తీసేయడానికి ఈ మూడు పదార్థాలు అద్భుతంగా పని చేస్తాయి.

1. కొబ్బరి నూనె :
మేకప్ రిమూవింగ్‌లో ‘కింగ్’ అని కొబ్బరి నూనెను చెప్పవచ్చు. ఇది ఎంతటి మొండి మేకప్‌నైనా ఇట్టే కరిగించేస్తుంది.

Advertisement

ఎలా వాడాలి?: కొద్దిగా కొబ్బరి నూనెను చేతుల్లోకి తీసుకుని ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి. మేకప్ కరిగిపోయాక, కాటన్ ప్యాడ్‌తో తుడుచుకోండి. ఇది చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా, సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి ముఖాన్ని మృదువుగా ఉంచుతుంది.

2. పచ్చి పాలు :
మీది సెన్సిటివ్ స్కిన్ అయితే.. పాలు మీకు బెస్ట్ ఆప్షన్. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.

ఎలా వాడాలి?: చల్లటి పచ్చి పాలలో ఒక దూది ఉండను ముంచి, దాంతో ముఖంపై ఉన్న మేకప్‌ను తుడవండి. ఇది కేవలం మేకప్‌ను మాత్రమే కాకుండా.. రోజంతా చర్మంపై చేరిన ధూళిని కూడా తొలగిస్తుంది. పాలు వాడటం వల్ల చర్మం ఎర్రగా మారడం వంటి సమస్యలు రావు.

3. దోసకాయ రసం :
మేకప్ తీసేటప్పుడు చర్మానికి చల్లదనం కావాలంటే.. దోసకాయ రసాన్ని వాడండి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ప్రశాంతపరుస్తాయి.

ఎలా వాడాలి?: దోసకాయను తురిమి రసం తీయండి. ఆ రసాన్ని ముఖానికి పట్టించి కాసేపటి తర్వాత తుడి చేయండి. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఇది ముఖంపై ఉన్న జిడ్డును తొలగించి, తాజాగా ఉంచుతుంది.

ముఖ్యమైన జాగ్రత్త:
మేకప్ తీసేసిన తర్వాత కేవలం తుడిచేసి వదిలేయకండి. తప్పని సరిగా గోరు వెచ్చని నీటితో ,. మైల్డ్ ఫేస్ వాష్‌తో ముఖం కడుక్కోండి. దీని వల్ల నూనె అవశేషాలు చర్మంపై మిగిలిపోకుండా ఉంటాయి.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×