E-Paper
Advertisement

Navel Lint: మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా.. మన బొడ్డులో పేరుకుపోయిన ఈ మెత్తటి పదార్థం ఏంటని?

Navel Lint: మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా.. మన బొడ్డులో పేరుకుపోయిన ఈ మెత్తటి పదార్థం ఏంటని?

Navel Lint: మానవ శరీరంలో అత్యంత సున్నితమైన ప్రాంతాలలో నాభి ఒకటి. దీనినే బొడ్డు అంటుంటాం. ఈ ప్రాంతం చాలా నరాలకు నిలయంగా ఉంటుంది. ఈ బొడ్డు చుట్టూ ఉన్న చర్మం చాలా మృదువుగా ఉండి మనం తాకితే సున్నితంగా అనిపిస్తుంది. అయితే, చాలామందికి నాభిలో ఉన్న ఆ పదార్థం ఏమిటని తెలియకపోవచ్చు. బొడ్డులో పేరుకుపోయే ఆ ప‌దార్థాన్ని ‘లింట్’ అంటారు. దీన్నే అంబైలికల్ లింట్ లేదా నావెల్ ఫ్ల‌ఫ్ అని కూడా పిలుస్తారు. నాభి లోప‌లికి ఉండే వారిలో ఇది ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంది. అయితే ఈ మెత్తటి పదార్థాన్ని త‌ర‌చూ శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.

లింట్ అంటే ఏమిటి?

మన నాభిలో ఏర్ప‌డే లింట్‌లో సాధార‌ణంగా మృత చ‌ర్మ క‌ణాలు, దుమ్ము, ధూళి క‌ణాలు, మ‌నం ధ‌రించే లేదా క‌ప్పుకునే వ‌స్త్రాల‌కు చెందిన మెత్త‌ని ఫైబ‌ర్‌, వెంట్రుక‌లు ఉంటాయి. ఇవ‌న్నీ క‌లిసి మెత్త‌ని ప‌దార్థంగా ఏర్ప‌డుతుంటాయి. దీనినే లింట్ అంటారు. అయితే, లింట్ అనేది స‌హ‌జ‌సిద్ధంగా ఏర్ప‌డుతుంది. దీని వలన మనకు ఎలాంటి ప్రమాదమూ లేదు. కానీ దీన్ని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. ఇన్‌ఫెక్ష‌న్స్ వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌. ఇక లింట్‌ను శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, చాలా సున్నితంగా నాభిలోని పదార్థాన్ని తొల‌గించాలని చెబుతున్నారు నిపుణులు. లేదంటే.. సెప్టిక్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. తగిన జాగ్ర‌త్త‌లతో నాభి నుంచి లింట్‌ను తొలగించాలి.

క్లీన్ చేయడం ఎలాగంటే..

బొడ్డు నుంచి లింట్‌ను తొలగించడానికి కాటన్ బడ్‌ను ఉపయోగించడం ఉత్తమం. అయితే, ఈ ప‌ని స్నానం చేసిన తర్వాత చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. స్నానం చేశాక చ‌ర్మం తేమ‌గా, మృదువుగా మారుతుంది. అప్పుడు క్లీన్ చేస్తే లింట్ సుల‌భంగా బ‌య‌ట‌కి వస్తుంది. లేదంటే స్నానం చేసిన త‌ర్వాత ఒక కాట‌న్ బ‌డ్‌ను తీసుకుని దాన్ని సున్నితంగా బొడ్డులో పెట్టి కుడి నుంచి ఎడ‌మ వైపుకు లేదా ఎడ‌మ నుంచి కుడి వైపుకు తిప్పాలి. దీంతో.. నాభిలోని లింట్ దానంత‌ట అదే బయటికొచ్చేస్తుంది. అయితే, కాట‌న్ బడ్ తడిగా కాకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే బొడ్డులో బ్యాక్టీరియా లేదా ఫంగ‌స్ పెరిగి ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.

ఆయిల్స్‌తోనూ శుభ్రం చేయొచ్చు:

నాభిలో ఉండే లింట్‌ను క్లీన్ చేసేందుకు.. కొబ్బ‌రినూనె, ఆలివ్ నూనె, బేబీ ఆయిల్ వంటి నూనెల‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. కొన్ని చుక్క‌ల‌ నూనెలను బొడ్డులో వేసి, 5 నుంచి 10 నిమిషాల పాటు వేచి ఉండాలి. త‌ర్వాత శుభ్ర‌మైన కాటన్ వస్త్రం లేదా కాట‌న్ బ‌డ్‌తో బొడ్డును తుడిచేస్తే సరి. బొడ్డు శుభ్రం చేసుకున్నాక.. స‌బ్బుతో ఆ ప్రాంతాన్ని క‌డిగేయాలి. దీనివ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్స్ రావు. అయితే.. నాభి క్లీనింగ్ కోసం ప‌దునైన వ‌స్తువులను ఉప‌యోగించ‌కూడ‌దు. అలాగే గోర్లను పూర్తిగా క‌త్తిరించాకే ఈ ప‌ని చేయాలి.

Related News

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

Big Stories

×