E-Paper
Advertisement

New Year 2026  Party Recipe: న్యూ ఇయర్ స్పెషల్, నోరూరించే ‘దూపుడు పోతు బిర్యానీ’.. ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో !

New Year 2026  Party Recipe: న్యూ ఇయర్ స్పెషల్, నోరూరించే ‘దూపుడు పోతు బిర్యానీ’.. ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో !
Advertisement

New Year 2026  Party Recipe: దూపుడు పోతు బిర్యానీ (లేదా దూకుడు పోతు బిర్యానీ) అనేది ఏపీ, ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో చాలా ఫేమస్. సాధారణ మటన్ బిర్యానీ కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఇందులో చిన్న వయసున్న పొట్టేలు (పోతు) మాంసాన్ని వాడటం వల్ల ముక్క చాలా మృదువుగా, రుచిగా ఉంటుంది. ఈ అద్భుతమైన బిర్యానీని ఇంట్లోనే రుచిగా ఎలా తయారు చేసుకోవాలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అవసరమైన పదార్థాలు:

మాంసం: 1 కేజీ దూపుడు పోతు మాంసం (చిన్న ముక్కలుగా కోయాలి)

Advertisement

బియ్యం: 1 కేజీ బాస్మతి బియ్యం లేదా చిట్టి ముత్యాలు

నూనె & నెయ్యి: తగినంత

ఉల్లిపాయలు: 4

పచ్చిమిర్చి: 4

అల్లం వెల్లుల్లి పేస్ట్: 3 టేబుల్ స్పూన్లు

పెరుగు: 1 కప్పు

మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గ.

పొడులు: కారం (2 స్పూన్లు), పసుపు (అర స్పూన్), ధనియాల పొడి, గరం మసాలాలు తగినంత

పుదీనా & కొత్తిమీర: ఒక్కో కట్ట

నిమ్మరసం: 4 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

1.ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు, కొంచెం నూనె, గరం మసాలాతో పాటు నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 1 నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టాలి. దీని వల్ల మసాలాలు మాంసం ముక్కలకు బాగా పట్టి.. ఉడికిన తర్వాత ముక్క మెత్తగా ఉంటుంది.

2.బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టాలి. ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకుని అందులో బిర్యానీ దినుసులు, కొద్దిగా నూనె, ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి 70% వరకు ఉడికించి, నీటిని వడకట్టి అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి.

3. ఆ తర్వాత అడుగు మందంగా ఉన్న బిర్యానీ పాత్రను తీసుకుని నూనె, నెయ్యి వేయాలి. వేడయ్యాక మిగిలిన బిర్యానీ దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మాంసాన్ని వేసి పది నిమిషాల పాటు ఎక్కువ మంటపై వేయించాలి. తర్వాత మంట తగ్గించి, మూత పెట్టి మాంసం మెత్తగా ఉడికే వరకు ఉంచాలి.

4. మాంసం దాదాపు ఉడికిన తర్వాత.. దానిపై పుదీనా, కొత్తిమీర చల్లాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఒక పొరలాగా పరవాలి. పైనుంచి వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా నెయ్యి, కుంకుమపువ్వు నీళ్లు చల్లి మూత పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా గోధుమపిండితో లేదా బరువుతో మూతను సీల్ చేయాలి.

5. సన్నని మంటపై 15 నుంచి 20 నిమిషాల పాటు దమ్ చేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా మరో 10 నిమిషాలు అలాగే ఉంచాలి. అప్పుడు బిర్యానీ సువాసన ముక్కలకు బాగా పడుతుంది.

6. ఇంకేముంది ఘుమలాడేదూపుడు పోతు బిర్యానీ’ సిద్ధం.దీనిని మిర్చి కా సాలన్ లేదా పెరుగు పచ్చడితో తింటే అద్భుతంగా ఉంటుంది. సాధారణ బిర్యానీ కంటే ఈ నాటు స్టైల్ లోని ఈ బిర్యానీ రుచి అద్భుతంగా ఉంటుంది.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×