E-Paper
Advertisement

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!
Advertisement

Smart Ring under 1500:  ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్ అవుతుందో చెప్పక్కర్లేదు. స్మార్ట్‌ వాచ్‌లు, ఇయర్‌బడ్స్ తర్వాత ఇప్పుడు మార్కెట్‌ను షేక్ చేయడానికి వచ్చేసింది “స్మార్ట్ రింగ్”. కేవలం రూ. 1,289 ఆఫర్ ధరకే.. లభిస్తున్న ఈ యూనివర్సల్ NFCమ్యాజిక్ వేరబుల్ డివైస్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు. పైగా డెప్త్ వాటర్ ప్రూఫ్ సపోర్ట్ కూడా ఉంది. మీ స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే.. ఈ మ్యాజికల్ రింగ్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

నో చార్జింగ్ :

ఈ స్మార్ట్ రింగ్స్ లో.. ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు. రోజూ ఫోన్లు, వాచ్‌లకు చార్జింగ్ పెట్టి విసిగిపోయిన వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో .. ఎలాంటి బ్యాటరీ ఉండదు. కేవలం మీ ఫోన్‌లోని NFC(నైర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) సిగ్నల్స్ , రేడియో వేవ్స్ ఎనర్జీని వాడుకొని ఇది రన్ అవుతుంది. కాబట్టి.. చార్జర్ పాడైందనో, బ్యాటరీ లైఫ్ అయిపోయిందనో భయపడాల్సిన పనే లేదు.

ఎన్‌ఎఫ్‌సీ మ్యాజిక్ :

Advertisement

ఈ రింగ్‌లో బిల్ట్-ఇన్ NFC చిప్ ఉంటుంది. దీని వల్ల మీ స్మార్ట్‌ఫోన్‌తో దీన్ని ఈజీగా కనెక్ట్ చేయొచ్చు.

కార్డ్ సిమ్యులేషన్: మీ ఆఫీస్ ఐడీ కార్డ్, మెట్రో కార్డ్ లేదా కొన్ని రకాల యాక్సెస్ కార్డులను ఈ రింగ్‌కి లింక్ చేసి, జస్ట్ వేలితో టచ్ చేసి డోర్స్ అన్‌లాక్ చేయొచ్చు.

Advertisement

ఫోన్ కంట్రోల్: మీ ఫోన్ లాక్ ఓపెన్ చేయడం, కొన్ని యాప్స్‌ని క్విక్‌గా లాంచ్ చేయడం, లేదా మీ వర్చువల్ విజిటింగ్ కార్డ్‌ని ఎవరికైనా షేర్ చేయడం వంటివి ఈ రింగ్ ద్వారా చిటికెలో చేయొచ్చు.

ప్రైవేట్ నోట్ షేరింగ్: మీ ఫోన్‌లోని కొన్ని సీక్రెట్ మెసేజ్‌లు లేదా అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఈ రింగ్‌లో స్టోర్ చేసుకొని.. వేరే వాళ్లకు జస్ట్ టచ్ ద్వారా పాస్ చేయొచ్చు.

డెప్త్ వాటర్ ప్రూఫ్:

ఈ స్మార్ట్ రింగ్ హై-గ్రేడ్ లిక్విడ్ టంగ్స్టన్, ఎపాక్సీ క్రిస్టల్ సిరామిక్‌తో.. తయారు చేయబడింది. దీని వల్ల ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. గీతలు పడవు. అన్నింటికంటే.. ముఖ్యంగా ఇది డెప్త్ వాటర్ ప్రూఫ్. అంటే.. మీరు చేతులు కడుక్కుంటున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, వర్షంలో తడిసినా లేదా స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్లినా సరే ఈ రింగ్‌ను తీయాల్సిన అవసరం లేదు. ఎలాంటి వాటర్ డామేజ్ అవ్వకుండా ఇది పక్కాగా పనిచేస్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

యూనివర్సల్ వేర్:

ఇది కేవలం టెక్ గ్యాడ్జెట్ మాత్రమే.. కాదు, మీ చేతికి ఒక మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. సింపుల్ అండ్ గ్లోసీ ఫినిషింగ్‌తో వచ్చే.. ఈ రింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికీ సెట్ అవుతుంది. ఇది సైజ్ 11 లో అందుబాటులో ఉంది. కాబట్టి కొనేముందు మీ వేలి సైజ్ చెక్ చేసుకోవడం మంచిది. ఈ రింగ్ లోపల ఉన్న హెల్త్ మెటీరియల్స్ మీ బాడీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయని కంపెనీ పేర్కొంది.

రూ. 1,289 బడ్జెట్‌లో.. ఒక ఫ్యూచరిస్టిక్ గ్యాడ్జెట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే.. ఫ్రెండ్స్ ముందు స్టైల్ చూపించాలనుకుంటే ఈ NFC మ్యాజిక్ స్మార్ట్ రింగ్ పర్ఫెక్ట్ చాయిస్. చార్జింగ్ పెట్టే.. తల పోటు లేకుండా.. వాటర్ ప్రూఫ్ ఫీచర్‌తో వచ్చే ఈ యూనివర్సల్ వేరబుల్ డివైస్ టెక్ లవర్స్ తప్పకుండా ట్రై చేయాల్సిన గ్యాడ్జెట్.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×