E-Paper
Advertisement

Potato Pancakes: పిల్లలకు నచ్చేలా బంగాళాదుంప పాన్ కేక్స్, చలిలో వేడిగా తింటే అదరహో

Potato Pancakes: పిల్లలకు నచ్చేలా బంగాళాదుంప పాన్ కేక్స్, చలిలో వేడిగా తింటే అదరహో
Advertisement

చలికాలంలో ఏదైనా వేడిగా, క్రిస్పీగా తినాలనిపిస్తుంది. ఇక పిల్లల కోసం ఏదో ఒకటి కొత్తగా చేయక తప్పదు. పిల్లలు కూడా ఇష్టపడేలా ఉండే బంగాళాదుంప పాన్ కేక్స్ ప్రయత్నించి చూడండి. ఇవి పిల్లలకే కాదు, పెద్దలకు కూడా బాగా నచ్చుతాయి. బంగాళాదుంపతో ఎన్నో వంటలు చేస్తాం. కానీ ఈ పాన్ కేక్స్ మాత్రం చేసేవారి సంఖ్య చాలా తక్కువ. వీటిని చాలా తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం స్నాక్‌గా, పిల్లల టిఫిన్‌లో, పార్టీల్లోసర్వ్‌ చేయడానికి ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం.

బంగాళాదుంప పాన్‌కేక్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు – మూడు
ఉల్లిపాయ – ఒకటి
గుడ్డు – ఒకటి
మైదా లేదా కార్న్‌ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి తగినంత
మిరియాల పొడి – అర చెంచా
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
నూనె – ఫ్రై చేయడానికి సరిపడా

Advertisement

తయారీ విధానం
1. ఈ బంగాళాదుంప పాన్ కేక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మన ఇంట్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఈ వంటకాన్ని ఎప్పుడైనా సులభంగా చేయవచ్చు.
2. బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తొక్క తీసేయండి. తర్వాత పెద్ద గ్రేటర్‌తో సన్నగా తురమండి.
3.సన్నగా తురిమిన తరువాత ఒక శుభ్రమైన గుడ్డలో పెట్టి బాగా పిండి అదనపు నీటిని తీసేయండి. నీరు ఎక్కువగా ఉంటే పాన్ కేక్స్ కరకరలాడవు.
4. తురిమిన బంగాళాదుంపలను ఒక బౌల్‌లో వేసి అందులో ఉల్లిపాయల తరుగు, మైదా లేదా కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి.
5. ఇప్పుడు ఆ మిశ్రమంలో గుడ్డును పగలగొట్టి వేయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
6. ఒక పాన్‌ స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె వేడి చేయండి.
7. బంగాళాదుంప మిశ్రమాన్ని చిన్న బంతుల్లా తీసుకుని చేత్తోనే గుండ్రంగా చిన్న పాన్ కేకుల్లా ఒత్తుకోండి.
8. వాటిని పెనంపై వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి.
9. అంతే క్రిస్పీ బంగాళాదుంప పాన్ కేక్స్ రెడీ అయినట్టే.
10. దీన్ని కెచప్, పుదీన చట్నీ లేదా పెరుగు ‌తో తింటే అద్భుతంగా ఉంటుంది.

సాయంత్రం టీతో పాటు దీన్ని తింటే అదిరిపోతుంది. అలాగే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా కూడా దీన్ని ప్లాన్ చేయవచ్చు. రెండు పాన్ కేకులు తింటే చాలు వారి పొట్ట నిండిపోతుంది. వీటిని చేసే పద్దతి కూడా చాలా సులువు కాబట్టి వారానికి ఒకసారైన పిల్లలకు చేసి పెట్టేందుకు ప్రయత్నించండి.

Related News

కొత్తగా పెళ్లయిన యువతికి ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న.. మీరైతే ఏం చేస్తారు?

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!

చాణక్య నీతి.. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే స్నేహితులు వీరే.. ఇలా గుర్తించండి

ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని మెడనొప్పిగా ఉందా? ఈ సింపుల్ వ్యాయామాలు చేస్తే సరి

రాత్రి చక్కగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటుందా? అయితే మీ బాడీలో ఈ 5 లోపాలున్నట్టే!

ఇంజెక్షన్ వేయించుకోవాలంటే భయపడుతున్నారా? ఇలా చేస్తే నొప్పి అసలు తెలియదు

పనీర్ తయారు చేశాక మిగిలిన నీటిని పారేస్తున్నారా? ఇలా చేస్తే టేస్టీ సూప్ రెడీ

Big Stories

Advertisement
×