E-Paper
Advertisement

Jolla smartphone: డేటా ట్రాకింగ్‌కు ఫుల్ స్టాప్… 5500mAh బ్యాటరీతో జొల్లా ఫోన్‌ ఎంట్రీ

Jolla smartphone: డేటా ట్రాకింగ్‌కు ఫుల్ స్టాప్… 5500mAh బ్యాటరీతో జొల్లా ఫోన్‌ ఎంట్రీ
Advertisement

Jolla smartphone: లైనక్స్‌ ఆధారంగా పూర్తిగా ప్రైవసీని కాపాడే కొత్త జొల్లా ఫోన్‌ మొబైల్‌ మార్కెట్‌లో భారీ చర్చకు కారణమైంది. ఆండ్రాయిడ్‌ ఐఓఎస్‌ అనే రెండు ఓఎస్‌లు ప్రపంచాన్ని పూర్తిగా కట్టడి చేస్తున్న సమయంలో, వినియోగదారుడి వ్యక్తిగత సమాచారం రోజంతా ట్రాక్‌ అవుతున్నప్పుడు, ఒక ప్రత్యామ్నాయం ఎప్పటికప్పుడు అవసరమవుతున్నదనే భావన పెరిగిపోయింది. యూరప్‌లో దాదాపు 12 ఏళ్లుగా పనిచేస్తున్న జొల్లా కంపెనీ ఇదే అవసరాన్ని గుర్తించి ప్రైవసీని ప్రధానంగా చూసే ఫోన్‌ను ముందుకు తీసుకొచ్చింది.

యూజర్‌ కదలికలను ట్రాక్‌ చేస్తుంది

Advertisement

ఈ ఫోన్‌ ప్రత్యేకతల్లో మొదటిది.. డేటా ట్రాకింగ్‌ లేకపోవడం. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్నో సేవలు నడుస్తూ యూజర్‌ డేటాను నిరంతరం సేకరిస్తాయి. ఐఓఎస్‌ కూడా తన స్ట్రిక్ట్‌ కంట్రోల్‌లో అనేక అంశాలను మానిటర్‌ చేస్తుంది. కానీ జొల్లా మాత్రం యూజర్‌ యొక్క ఏ కదలికలను ట్రాక్‌ (Track any user action) చేయదు. ఎలాంటి డేటా కలెక్ట్‌ చేయదని కంపెనీ స్పష్టంగా చెప్పింది. ఈ పాయింట్‌ ఒక్కడే దీనిని మార్కెట్‌లో ఒక ప్రత్యేక ఫోనుగా నిలబెడుతుంది.

డిసేబుల్‌ చేసుకునే అవకాశం

Advertisement

జొల్లా లైనక్స్‌ ఆధారిత ఓఎస్‌ను ఉపయోగించడం దీని మరొక శక్తి. ఓపెన్‌ సోర్స్‌ వ్యవస్థ కాబట్టి వినియోగదారుడు తన ఫోన్‌పై పూర్తిగా కంట్రోల్ పొందుతాడు. సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తర్వాత కెమెరా, మైక్రోఫోన్‌, బ్లూటూత్‌, సెన్సార్లు మొత్తం డిసేబుల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫోన్‌ యూజర్‌ గురించి ఒక్క సమాచారం కూడా బయటకు వెళ్లకుండా పూర్తిగా సైలెంట్‌ మోడ్‌లో పనిచేస్తుంది. సాధారణ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఇది అసాధ్యం.

ఆండ్రాయిడ్‌ యాప్‌లకు సపోర్ట్‌

ప్రైవసీకి ప్రాముఖ్యత ఇస్తూ కూడా యాప్‌ల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్‌ యాప్‌లకు సపోర్ట్‌ ఇస్తుంది. జొల్లా యాప్‌ సపోర్ట్‌ ద్వారా యూజర్‌ అవసరమైన గూగుల్‌ యాప్‌లను కూడా డౌన్‌లోడ్‌ చేసుకొని వాడుకోవచ్చు. అందువల్ల ప్రైవసీ కోసం ఫీచర్లు త్యాగం చేసిన భావన రాదు. మార్కెట్‌లో ఇంతకుముందు వచ్చిన ప్రత్యామ్నాయ ఓఎస్‌లు యాప్‌ సపోర్ట్‌ లేక నిలబడలేకపోయినా, జొల్లా ఈ సమస్యను సింపుల్‌గా పరిష్కరించింది.

Also Read: Best Mobiles Under 10000: రూ.10 వేల లోపు బెస్ట్ 5జి ఫోన్‌లు ఇవే.. బడ్జెట్ కింగ్‌ కోసం మార్కెట్‌లో భారీ డిమాండ్

క్లాసిక్ డిజైన్‌

ఫోన్‌ డిజైన్‌లో కూడా ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. బ్యాటరీని బయటకు తీసేయగలిగే పాత మోడల్‌ను మళ్లీ అందులో అమర్చడం వల్ల ఎక్కువకాలం ఫోన్‌ను వాడే వారికి ఇది అదనపు ప్రయోజనం. ఫోన్‌ మొత్తం 3 రంగుల్లో అందుబాటులో ఉంది. డిజైన్‌ కూడా సింపుల్‌‌గా, క్లాసిక్ గా ఉండడం వల్ల యూజర్‌కు ఒక ఫ్రెష్‌ అనుభవాన్ని ఇస్తుంది.

హై-ఎండ్‌ కేటగిరీ డివైస్‌

హార్డ్‌వేర్‌ విషయానికి వస్తే ఇందులో 5జీ సపోర్ట్‌ ఉంది. ర్యామ్‌ 12జిబి, స్టోరేజ్‌ 256జిబి. డిస్‌ప్లే 6.36 అంగుళాల ఆమోలెడ్‌, గొరిల్లా గ్లాస్‌ రక్షణతో వస్తుంది. కెమెరాల్లో ప్రధాన సెన్సార్‌ 50ఎంపి, సెకండరీ సెన్సార్‌ 13ఎంపి. బ్యాటరీ సామర్థ్యం 5500mAh ఉండటం వల్ల రోజంతా ఛార్జింగ్ అవసరం లేకుండా పనిచేస్తుంది. ఈ స్పెసిఫికేషన్లు చూస్తే ఇది సాధారణ ప్రైవసీ ఫోన్‌ కాదు, పూర్తిగా హై-ఎండ్‌ కేటగిరీలోకి వెళ్లే డివైస్‌ అని అర్థమవుతుంది.

ఇండియాలో ధర.. మార్కెట్‌లో ఎంట్రీ

ధర విషయానికి వస్తే , జొల్లా ఫోన్ భారతీయ మార్కెట్‌లో రూ. 62,960 నుండి రూ. 73,480 మధ్య ధర పలుకుతోంది. తమ వ్యక్తిగత డేటా రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే వినియోగదారుల కోసం ఈ ధరను నిర్ణయించారు.ఇక జొల్లా ఫోన్‌ గురించి లాంచ్‌ వివరాలు చూస్తే పరిస్థితి కొంచెం క్లియర్‌గా తెలుస్తుంది. ప్రీ–ఆర్డర్లు 2025 చివర్లోనే ప్రారంభమైనా, తయారీ సామర్థ్యం ఇంకా పూర్తి స్థాయిలో లేకపోవడం వలన అసలు ఫోన్‌ వినియోగదారుల చేతుల్లోకి వచ్చే సమయం 2026 జనవరిలో వచ్చే అవకాశం ఉంది. అంటే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న ఆర్డర్ల సంఖ్య నెరవేరిన తర్వాతే ప్రొడక్షన్‌ ప్రారంభం కానుంది. అందువల్ల జొల్లా ఫోన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వినియోగదారులు ఈ ప్రైవసీ–ప్రాధాన్యతనిస్తూ లైనక్స్‌ ఫోన్‌ను నిజంగా పొందే సమయం 2026లోనే ఉండే అవకాశం స్పష్టమైంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×