E-Paper
Advertisement

Relationship secrets: ఇష్టం కాదు బాస్… నిజంగా ప్రేమిస్తున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి!

Relationship secrets: ఇష్టం కాదు బాస్… నిజంగా ప్రేమిస్తున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి!
Advertisement

Relationship secrets:నిజం చెప్పాలంటే…ప్రేమ అనేది సినిమాల్లోలా ఉండదు…
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదు…స్లో మోషన్ చూపులు కూడా ఉండవు…
ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా తెలుసుకోవాలంటే…
వాళ్లు ఏం చెప్తున్నారో కాదు…వాళ్లు ఏం చేస్తున్నారో చూడాలి.
ఎవరైనా మిమ్మల్ని పదే పదే చూస్తున్నారా…చూసిన వెంటనే చూపు తిప్పుకుంటున్నారా…
మళ్లీ మళ్లీ మీ వైపే చూపు వెళ్తుందా…
అది ఆసక్తి కావొచ్చు…కానీ గమనించడమే ప్రేమ కాదు.
మీతో మాట్లాడాలి అనిపిస్తుంది…కానీ సిగ్గు అడ్డొస్తుంది…
అయినా అవకాశం దొరికితే మాత్రం వదలరు…
మళ్లీ మళ్లీ మాట మొదలెడతారు…మీతో మాట్లాడటానికి ట్రై చేస్తారు…
మీ గురించి తెలుసుకోవాలని అడుగుతారు…
మీ గురించి చిన్న విషయం అయినా గుర్తుంచుకుంటారు…
మీ అలవాట్లు… మీ ఇష్టాలు… మీ మాటలు…అన్నీ తెలుసుకోవాలని ట్రై చేస్తారు…
మీ చుట్టూనే తిరుగుతారు…మీ ప్రపంచమే వాళ్ల ప్రపంచం అవుతుంది…
అవసరం ఉన్నా లేకపోయినా దగ్గరకి వస్తారు…
ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తారు…మీరు ఇంకెవరితోనైనా క్లోజ్‌గా ఉంటే…
లోలోపల అసూయ… బయట మౌనం…ఇవి ప్రేమికుల లక్షణాలు కాకపోతే మరేమిటి?

కానీ అసలైన ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది తెలుసా…
మీకు అవసరం వచ్చినప్పుడు..మీరు బలహీనంగా ఉన్నప్పుడు కూడా వాళ్లు అక్కడ ఉంటున్నారా?
మీరు సక్సెస్ అయ్యేప్పుడు అసూయపడకుండా సంతోషపడుతున్నారా?
మీ తప్పులను కూడా అర్థం చేసుకునే ఓపిక ఉంటుందా?
మీతో మాట్లాడలేకపోయినా మీపై గౌరవం తగ్గట్లేదా?
మీ లైఫ్‌లో మీ స్థానం కోసం ఎటువంటి షార్ట్‌కట్స్ వెతకట్లేదా?
నిజానికి, నిజంగా ప్రేమించే వ్యక్తి ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడూ నటించడు. మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడడు, అవసరానికి మించి దగ్గరవ్వడు. వారి ప్రేమలో ఎటువంటి ‘ఓవరాక్షన్’ ఉండదు, కానీ అది ఎప్పుడూ మీ వెంటే నిలబడి ఉంటుంది. కాబట్టి, ఎవరైనా మీపై శ్రద్ధ చూపిస్తున్నారంటే ఫీల్ అవ్వండి, కానీ గుడ్డిగా నమ్మకండి. మీ కష్టాల్లో కూడా వారి ప్రవర్తన మారకుండా, మీపై గౌరవం తగ్గకుండా ఉంటేనే.. అది 100% ప్యూర్ లవ్!

Advertisement

ఇప్పటికైనా ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోండి.. వాళ్లు మిమ్మల్ని కేవలం ఇష్టపడుతున్నారా (Crush)? లేక మీ కష్టసుఖాల్లో తోడుండేలా నిజంగా ప్రేమిస్తున్నారా?

Related News

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

Big Stories

Advertisement
×