E-Paper
Advertisement

Turmeric milk: పసుపు పాలు తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాక్ అవుతారు!

Turmeric milk: పసుపు పాలు తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

Turmeric milk: చాలా మంది ఇళ్లలో పసుపు పాలు ఒక సంప్రదాయ ఔషధం. జలుబు చేసినా, ఒళ్లు నొప్పులు ఉన్నా అమ్మ వెంటనే ఇచ్చేది పసుపు పాలే. పసుపులో ఉండే ‘కర్కుమిన్’ అనే పదార్థం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే.. పసుపు పాలు తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, పద్ధతి ప్రకారం తాగకపోతే అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మోతాదుకు మించి తాగడం వల్ల లేదా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశంలో పసుపును ప్రతి వంటకంలోనూ ఉపయోగిస్తాం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నది వాస్తవం. కానీ నేటి కాలంలో ‘గోల్డెన్ మిల్క్’ పేరుతో దీని వినియోగం విపరీతంగా పెరిగింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పసుపు పాలు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..

Advertisement

1. జీర్ణ సంబంధిత సమస్యలు:

పసుపు సహజంగానే శరీరంలో వేడిని పెంచుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ పరిమాణం ఎక్కువైతే కడుపులో గ్యాస్, ఉబ్బరం , విరేచనాలు కలిగే అవకాశం ఉంది. కొంత మందిలో ఇది ఎసిడిటీకి దారి తీసి, జీర్ణక్రియను మందగింపజేస్తుంది. అందుకే సెన్సిటివ్ కడుపు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

2. కిడ్నీలో రాళ్ల భయం:

పసుపులో ‘ఆక్సలేట్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ రాళ్లుగా మారుతాయి. ఇప్పటికే కిడ్నీలో.. రాళ్ల సమస్యతో బాధపడేవారు లేదా ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు పసుపు పాలను అతిగా తీసుకోకూడదు. ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది.

3. ఐరన్ లోపం:

పసుపు శరీరంలో ఐరన్ గ్రహించే శక్తిని తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు ఇప్పటికే అనీమియా (రక్తహీనత) తో బాధపడుతుంటే.. అధికంగా పసుపు పాలు తాగడం వల్ల ఆహారం నుంచి లభించే ఐరన్‌ను మీ శరీరం సరిగ్గా గ్రహించలేదు. దీని వల్ల రక్తహీనత పెరిగే ప్రమాదం ఉంది.

4. గర్భిణీలకు ప్రమాదం:

గర్భిణీ స్త్రీలు ఆహారంలో తక్కువ పరిమాణంలో పసుపు తీసుకోవడం సురక్షితం. కానీ ఔషధంగా లేదా పాలలో ఎక్కువ మోతాదులో పసుపు తీసుకోవడం వల్ల గర్భాశయ గోడలపై ఒత్తిడి పెరిగి, గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు ఇచ్చే తల్లులు కూడా డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి.

Also Read: పరగడుపున ఉసిరికాయ తింటే కలిగే.. అద్భుత ప్రయోజనాలు

5. రక్తపోటు, డయాబెటిస్ :

బీపీని తగ్గించే మందులు లేదా షుగర్ లెవల్స్ తగ్గించే ఇన్సులిన్ వాడుతున్న వారు పసుపు పాలను అతిగా తాగకూడదు. ఎందుకంటే పసుపు సహజంగానే షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. మందులతో పాటు ఇది కూడా కలిస్తే షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయే అవకాశం ఉంది.

6. సర్జరీకి ముందు జాగ్రత్త:

పసుపు రక్తాన్ని పల్చబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా సర్జరీ చేయించుకోవాల్సి వస్తే.. దానికి కనీసం రెండు వారాల ముందే పసుపు పాలు లేదా పసుపు సప్లిమెంట్లను ఆపేయాలి. లేదంటే సర్జరీ సమయంలో రక్తస్రావం ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×