E-Paper
Advertisement

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!
Advertisement

Digestive issues: మనం రోజువారీ జీవితంలో పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ లాంటి ఎంతో పోషకమైన ఆహారం తింటుంటాం. అయినా సరే.. తరచూ కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. “అన్ని మంచి పదార్థాలే తింటున్నా కదా, మరి ఈ సమస్యలు ఎందుకొస్తున్నాయి?” అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే సమస్య మీరు తినే ఆహారంలో.. కాదు.. ఆ ఆహారాన్ని మీరు తింటున్న పద్ధతిలోనే ఉంది! మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే అసలు కారణం. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. ఆహారాన్ని సరిగ్గా నమకకపోవడం :
బిజీ లైఫ్‌స్టైల్ వల్ల చాలా మంది ఆహారాన్ని త్వరత్వరగా నమిలీ నమలకుండా మింగేస్తుంటారు. జీర్ణక్రియ నోటి నుంచే ప్రారంభమవుతుంది. ఆహారాన్ని బాగా నమిలినప్పుడు నోటిలోని లాలాజలం ఆహారంతో కలిసి ఈజీగా అరిగేలా చేస్తుంది. సరిగ్గా నమలకుండా పెద్ద పెద్ద ముక్కలను మింగేస్తే.. పొట్ట దానిని అరిగించడానికి ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటివి వస్తాయి.

Advertisement

2.  నీళ్లు :
ఇది చాలామంది చేసే అతిపెద్ద తప్పు! తినేటప్పుడు గ్లాసుల కొద్దీ నీళ్లు తాగడం వల్ల పొట్టలోని జీర్ణ రసాలు పల్చబడిపోతాయి. దీని వల్ల మనం తిన్న పోషకాహారం సరిగ్గా అరగక పొట్టలోనే కుళ్ళిపోయి గ్యాస్‌గా మారుతుంది. భోజనానికి అరగంట ముందు, తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం బెస్ట్.

3. భోజనంతో పాటు కాంబినేషన్ :
మీరు తినేవి విడివిడిగా హెల్దీగా ఉన్నప్పటికీ.. వాటిని కలిపి తిన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది.

Advertisement

ఉదాహరణకు: పాలు, పండ్లు కలపడం, పెరుగుతో పాటు జంక్ లేదా వేపుళ్ళు తినడం.

పండ్లను ఎప్పుడూ భోజనంతో పాటు లేదా భోజనం చేసిన వెంటనే తినకూడదు. పండ్లను విడిగా, పరగడుపున లేదా సాయంత్రం స్నాక్‌లా తీసుకోవాలి.

4. తిన్న వెంటనే పడుకోవడం లేదా కూర్చోవడం:
రాత్రి వేళ హెల్దీ ఆహారమే తిన్నప్పటికీ.. తిన్న వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుంది. తిన్న ఆహారం తిరిగి ఈసోఫేగస్ లోకి వచ్చి గుండెల్లో మంట, ఎసిడిటీకి దారితీస్తుంది. తిన్న తర్వాత కనీసం 15-20 నిమిషాలు నడవాలి.

5. మానసిక ఒత్తిడి & నిద్రలేమి:
మన మైండ్ కి, గట్‌కి నేరుగా సంబంధం ఉంటుంది. మీరు ఎంత మంచి ఆహారం తిన్నా.. తీవ్రమైన ఒత్తిడి లేదా భయంలో ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. అలాగే రోజుకు 7-8 గంటల నిద్ర లేకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది.

పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. ప్రశాంతంగా, బాగా నమిలి, సరైన సమయంలో తినడం కూడా అంతే ముఖ్యం. ఈ చిన్న చిన్న మార్పులను మీ రోజువారీ అలవాట్లలో చేర్చుకుంటే కడుపు సమస్యలన్నీ మాయమై మీ ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.

Tags

Related News

మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఆహార పదార్థాలు.. ఆ దేశాల్లో కంప్లీట్ బ్యాన్, ఎందుకో తెలుసా?

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

Big Stories

Advertisement
×