korean-kanakaraju-og:పవన్ కళ్యాణ్ ‘OG’ కి, ఈమధ్య ‘కొరియన్ కనకరాజు’ సినిమాకి మధ్య ఏవో కనెక్షన్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి.సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా కావడంతో మూవీ లవర్స్ మైండ్‌లో వెంటనే OG గుర్తుకురావడం,పైగా ఈ కొరియన్ కనకరాజు ట్రైలర్ చూస్తుంటే కొన్ని సీన్లు, వరుణ్ తేజ్ లుక్ అచ్చం పవన్ కళ్యాణ్ మాదిరిగానే అనిపించడంతో ఈ అనుమానాలు మరింత బలపడిపోయాయి.
రెండు సినిమాల మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా
దానికితోడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కావడంతో, వరుణ్ తేజ్ కూడా తనకు OG తరహాలోనే మైండ్ బ్లాక్ అయ్యే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావాలని అడిగి మరీ చేయించుకోవడంతో జనాల్లో రెండు సినిమాల మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు.అసలే ఇది యూనివర్స్ జమానా ,కొంపదీసి అలా ఏమైనా రెండు సినిమాలని కలిపేస్తున్నారా అన్న డౌట్ కూడా రైజ్ అయిపొయింది.దీనికి తోడు ఓజాస్ గంభీర కథ జపాన్ నేపథ్యంలో సాగితే, కనకరాజు కథ కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో రావడం కూడా ఆ అనుమానాలని మరింత పెంచేసింది.
హీరోల లుక్స్ కాస్త గ్యాంగ్‌స్టర్ షేడ్స్‌లో పోలి ఉండటతో
అయితే ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మేర్లపాక గాంధీ క్లారిటీ ఇచ్చేశాడు. OG సినిమాకి, తమ కొరియన్ కనకరాజుకి ఎలాంటి సంబంధమూ లేదని తేల్చిచెప్పేశాడు.కథలు పక్కపక్క దేశాలైన జపాన్, కొరియాల చుట్టూ తిరగడం, హీరోల లుక్స్ కాస్త గ్యాంగ్‌స్టర్ షేడ్స్‌లో పోలి ఉండటం,మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే కావడంతో ప్రేక్షకులకు అలా అనిపించి ఉండొచ్చని,అంతకుమించి రెండింటికీ ఏ పోలికా లేదని క్లియర్‌గా చెప్పేశాడు.అసలు తమ కథ కంప్లీట్ డిఫరెంట్ ఎంటర్‌టైనర్ అని, ప్రేక్షకులు థియేటర్లలో కొత్త ఫీల్ పొందుతారని కాన్ఫిడెన్స్ చూపించాడు డైరెక్టర్ మేర్లపాక.
also read :NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!
ఇదిలా ఉంటే, ఈ కొరియన్ కనకరాజు సినిమాని ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.యువి క్రియేషన్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకి ఆగస్టు 7న గట్టి పోటీనే ఎదురుకానుందని మిగతా సినిమాలని చూస్తేనే అర్థం అవుతుంది. ఎందుకంటే అదే రోజున లోకేష్ కనగరాజ్ ప్రొడక్షన్ లో వస్తున్న ‘డీసీ’ సినిమాతో పాటు మంచి బజ్ ఉన్న ‘కెజెక్యూ’, మరియు ‘అనకాపల్లి’ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి.
కొరియన్ కనకరాజైనా ఈ మెగా అబ్బాయిని గట్టున పడేస్తుందో
ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే అప్పుడెపుడో గద్దల కొండ గణేష్ సినిమాతో హిట్ చూసిన ఈ మెగా ప్రిన్స్ అప్పటి నుండి మరో హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.ముచ్చటపడి చేసిన F3 పర్లేదనిపించుకున్నాఅది కాస్తా వెంకీ మామ ఖాతాలోకి వెళ్ళిన పరిస్థితి.ఇక ఆ తర్వాత వచ్చిన ఆపరేషన్ వాలంటైన్, గాండీవ దారి అర్జున,మట్కా ఇలా చేసిన ఏ సినిమా కూడా విజయం సాధించనివే. చూడాలి మరి భారీ ఆశలు పెట్టుకొని డిఫరెంట్ గా వస్తున్న కొరియన్ కనకరాజైనా ఈ మెగా అబ్బాయిని గట్టున పడేస్తుందో !