E-Paper
Advertisement

ఎర్రటి మిరపకాయలు ఏడాది కాలం రంగు, రుచి మారకూడదా?

ఎర్రటి మిరపకాయలు ఏడాది కాలం రంగు, రుచి మారకూడదా?
Advertisement

Store Chillies: సమ్మర్ వచ్చిందటే చాలు ..సంవత్సరానికి సరిపడా కారాన్ని పట్టించడం, తాలింపుల కోసం మిరపకాయలను నిల్వ చేసుకోవడం ప్రతీ తెలుగు వారిళ్ళల్లో కామన్. అయితే చాలా మంది ఎదుర్కునే సమస్య ఏంటో తెలుసా..నిలువ చేసుకునే  మిరపకాయలు కొన్ని రోజులకే కారం రంగు మారిపోవడం లేదా పురుగు పట్టడం.ఇలా జరగకుండా ఉండాలంటే మిరపకాయలను కొన్న దగ్గర నుండి నిల్వ చేసే వరకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.

పాడైనవి విడిగా..

Advertisement

ముఖ్యంగా చేయాల్సిన మొదటి పని మార్కెట్ నుండి మిరపకాయలు తెచ్చుకున్న వెంబటే కలర్ మారినవి, పాడైనవి విడిగా చేసి పక్కన పెట్టుకోవాలి.ఎందుకంటే చెడిపోయిన కాయ ఉన్నాఅది మిగతా వాటన్నింటిని చెడగొట్టడం పక్కా.ఇక  వీటిని నిల్వ చేసే ముందు కనీసం రెండు మూడు రోజుల పాటు ఎండలో గలగలలాడే వరకు ఆరనివ్వాలి.అలా కాకుండా తేమ ఉంటే బూజు పడుతుంది కాబట్టి, ఆరిన తర్వాత మాత్రమే తొడిమలు తీసి ఉంచుకోవాలి.ఒక్కటి గుర్తుంచుకోండి..తొడిమలు ఉంటే పురుగు పట్టే అవకాశం ఎక్కువ.

గాలి చొరబడని గాజు సీసాలు లేదా స్టీల్ డబ్బాలలో  

Advertisement

ఇక నిల్వ చేసే విషయంలో ప్లాస్టిక్ కవర్ల కంటే గాలి చొరబడని గాజు సీసాలు లేదా స్టీల్ డబ్బాలే ఉత్తమం.ఇక డబ్బా అడుగున ఒక చిన్న ఇంగువ ముక్క లేదా కొన్ని ఎండిన వేప ఆకులు, కొద్దిగా పసుపు వేస్తే పురుగు చేరదు,రంగు కూడా మారదు.ఇక ఎప్పుడైనా మిరపకాయలు మెత్తబడినట్లు అనిపిస్తే,వాటిని కాసేపు పెనంపై తక్కువ మంట మీద వేడి చేసి ఆరనిస్తే మళ్ళీ కరకరలాడతాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా వంట చేసేటప్పుడు పొరపాటున కూడా తడి చేతులతో డబ్బాను ముట్టుకోకూడదు. అలాగే ఈ డబ్బాలను నేరుగా ఎండ తగిలే చోట కాకుండా, చల్లని మరియు చీకటి ప్రదేశంలో ఉంచితే వాసన పోకుండా ఉంటుందన్న విషయం మరవొద్దు.

జిప్‌లాక్ కవర్లలో ఉంచి ఫ్రిజ్‌లో..

 ఇక కారం పొడి విషయానికి వస్తే.. కేవలం ఒట్టి మిరపకాయలు మాత్రమే  కాకుండా అందులో దోరగా వేయించిన ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి వంటివి కలిపి కారం పట్టిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ పొడిని జిప్‌లాక్ కవర్లలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే సువాసన, రంగు అస్సలు తగ్గవు.ఇక మిర్చిని దంచే ముందు తక్కువ మంట మీద కాస్త  దోరగా వేయిస్తే దానిలోని తేమ పోయి సువాసన డబల్ అవుతుంది.ఇకపోతే  పచ్చళ్ల కోసం కారం సిద్ధం చేసేటప్పుడు 70 శాతం ఘాటైన గుంటూరు మిర్చిని, 30 శాతం రంగు ఇచ్చే బ్యాడగి లేదా కశ్మీరీ మిర్చిని సెలెక్ట్ చేసుకున్నారంటే పచ్చడి చూడగానే నోరూరించడం పక్కా. సో . ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే  మీ వంటింట్లో కారం ఏడాది మొత్తం ఫ్రెష్‌గా ఉంటుందన్న మాట.

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×