E-Paper
Advertisement

వడదెబ్బకు చెక్ పెట్టే సూపర్ డ్రింక్స్: ఒక్క గ్లాసు తాగితే చాలు.. రోజంతా ఫుల్ ఎనర్జీ!

వడదెబ్బకు చెక్ పెట్టే సూపర్ డ్రింక్స్: ఒక్క గ్లాసు తాగితే చాలు.. రోజంతా ఫుల్ ఎనర్జీ!
Advertisement

Summer Tips : సమ్మర్ సెగ మాములూగా తగలట్లేదు. బయట అడుగుపెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి. మరి బయటకి వెళ్ళకుండా తప్పనప్పుడు ఆరోగ్యాన్ని ఎండ బారినుండి ఎలా రక్షించుకోవాలో, ఏ ఏ ఆహార పదార్థాలు, పానీయాలతో బాడీని కూల్ గా ఉంచుకోవచ్చో తెలుసుకుందామా !

ఇవి మన పాలిట అమృతం

Advertisement

ఎండ వేడి తగలగానే మనకి గుర్తొచ్చే మొదటి డ్రింక్ .. కొబ్బరి నీళ్ళు.ఒక రకంగా చెప్పాలంటే ఇవి మన పాలిట అమృతం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కొబ్బరి నీళ్ళల్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ మన బాడీలోని వాటర్ లెవల్ ని బాలెన్స్ చేయడమే కాకుండా మెదడును ఎంతో షార్ప్ గా ఉంచుతుంది.ఇక ఈ నీటిని తాగడానికే కాదు, ముఖానికి రుద్దుకుంటే కూడా హీట్ తగ్గి కూల్ గా అనిపిస్తుంది.

మీ బాడీ ఓ కూలర్ అయిపోతుంది

Advertisement

ఇక కొబ్బరి నీళ్ళతో పాటు మనకు సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మజ్జిగ.ఇది అందరికి అందుబాటులో ఉంటుంది కూడా. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటం దీని స్పెషల్.అందుకే మజ్జిగను క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు గనుక లాగిస్తే మీ బాడీ ఓ కూలర్ అయిపోతుంది.ఇక కడుపులో మంట, అల్సర్ వంటి వాటితో తీవ్రంగా బాధపడే వారు గనుక ఒక గ్లాస్ ఈ మజ్జిగని పట్టించారంటే అన్నీ పరార్ అవడం పక్క.

మీవద్దకి రావాలంటేనే భయపడిపోతుంది

ఇక ఇవన్ని ఇలా ఉంటే మన తాత ముత్తాతల కాలం నాటి నుండి ఫేమస్ అయిపోయింది అంబలి.దీన్ని గనుక ఉదయం ఒక గ్లాస్, మధ్యాహ్నం ఒక గ్లాస్ పొట్టలో పోశామంటే బాడీకి ఇన్‌స్టంట్ ఎనర్జీని ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఇక దీనిలో కాసింత చల్లటి మజ్జిగ, కొంచెం ఉప్పు కలిపి తాగారంటే దెబ్బకి వడ దెబ్బ మీవద్దకి రావాలంటేనే భయపడిపోతుంది.ఇక వీటికి తోడు బాడీ హీట్ తగ్గించడం లో కలబంద చేసే కృషి అంతా ఇంతా కాదు.కలబంద జెల్‌లో కాసింత దోసకాయ గుజ్జు లేదా పుదీనా రసం కలిపి తీసుకున్నారంటే చల్లదనంతో మీరు దోస్తీనే చెయ్యొచ్చు.అంతే కాదండోయ్… ఈ కలబంద జెల్‌ను చర్మానికి రాసుకున్నారంటే గనుక ఎండ నుండి వచ్చే వేడికి రక్షణ కల్పించినట్టే.

also read :విక్రమ్ సాహిదేవ్ ‘అనకాపల్లి’ మాస్ ట్రీట్.. మంగ్లీ వాయిస్‌తో మారుమోగుతున్న అమ్మోరు పాట!

తాటి ముంజెలను మర్చిపోగలమా

ఇక పుదీనా విషయానికి వస్తే రోజు మన కిచెన్‌లో కనిపిస్తూనే ఉంటుంది.దీనికున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా.. బాడీ హీట్ ని స్టేబుల్ చేయడం.మనం తీసుకునే పెరుగు, నిమ్మరసం లేదా ఇతర జ్యూస్‌లలో కాసింత పుదీనాను కలిపారంటే లాభాలు డబుల్ అయిపోతాయ్.ఇక సమ్మర్ లో తెలంగాణా ఐస్ ఆపిల్స్ గా పిలిచే తాటి ముంజెలను మర్చిపోగలమా.వీటిని గనుక ఒకసారి తిన్నారంటే బాడీ లోని హీట్ ని బయటకు పంపి, కడుపును చల్లగా ఉంచడం మీకు క్లియర్ గా తెలుస్తుంది.

సమ్మర్ లో దొరికే ఒక వరం

అలాగే సమ్మర్ లో ఈ జ్యూస్‌లన్నింటిలో కాసిన్ని సబ్జా గింజలు కలిపితే వాటి రేంజే మారిపోతుంది.అలా కాకున్నా ఒక గ్లాసు నీళ్లలో కొన్ని సబ్జా గింజలు నానబెట్టి తాగినా ఎంతటి వేడి అయినా నిమిషాల్లో తగ్గిపోవడం ఖాయం.ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే వాటర్ మిలన్ ..అదేనండి పుచ్చకాయ సమ్మర్ లో దొరికే ఒక వరం అని చెప్పుకోవాలి.ఎందుకంటే ఇందులో దాదాపు 92 శాతం నీటిని కలిగి ఉండి డీహైడ్రేషన్‌ను దూరం చేస్తుంది.

నాట్ బట్ లీస్ట్

అలాగే 95 శాతం నీటితో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉండే దోసకాయను క్రమం తప్పకుండా తీసుకున్నారంటే హీట్ తగ్గడంతో పాటు మలబద్ధకాన్ని తరిమి కొడుతుంది. ఇక కళ్ళని కూల్ చేయడానికి దోసకాయలను కళ్ళపై పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం.ఇక రుచికరంగానే కాకుండా బాడీని ఒక కూలెంట్ గా చేసి బ్లడ్ ని ప్యూరిఫై చేసే సుగంధి పాల (నన్నారి) షర్బత్ గురించి స్పెషల్ గా చెప్పర్లేదు.నాట్ బట్ లీస్ట్… నిమ్మకాయ రసం బాడీని కూల్ గా ఉంచడంలో సాయం చేస్తుందో అందరికి తెలిసిందే. విటమిన్-C ని అధ్బుతంగా అందించే ఈ రసం శరీరానికి అవసరమైన తేమను, ఆక్సిజన్‌ను అందించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

సో… ఎండలు మండుతున్నాయిగా అంటూ కళ్ళకి ఆకర్షణీయంగా కనిపించే కూల్ డ్రింక్స్ వైపు పోకుండా ఈ పానియాలని ఓ పట్టు పట్టేయ్యండి. ఓకే నా!

also read :ఛోళీ కే పీచే.. మళ్ళీ అదే డర్టీ పిక్చర్! తమన్నాకు ఇది అవసరమా?

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×